అనంతపురం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

సత్యసాయిబాబా పరిస్థితి విషమం: మొదటిసారి ఆందోళనకర బులెటిన్

By Srinivas
|
Google Oneindia TeluguNews

Sathya Sai Baba
అనంతపురం: భగవాన్ శ్రీ సత్యసాయిబాబా ఆరోగ్యంపై సిమ్స్ డాక్టర్లు గురువారం ఓ బులెటిన్ విడుదల చేశారు. అయితే 20 రోజులుగా విడుదల చేస్తున్న బులెటిన్ తరహా కాకుండా గురువారం విడుదల చేసిన బులెటిన్ బాబా భక్తులను తీవ్ర ఆందోళనకు గురి చేసేలా ఉంది. ఇన్నాళ్లూ బాబా పరిస్థితి నిలకడగా ఉందిని చెప్పిన డాక్టర్లు తాజా బులెటిన్‌లో మాత్రం బాబా పరిస్థితి విషమంగా ఉందని చెప్పారు. దీంతో భక్తులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. బాబాకు వెంటిలేషన్ ద్వారానే చికిత్స అందిస్తున్నట్టుగా చెప్పారు. బాబా శరీరం వైద్యానికి ఆశించిన స్థాయిలో సహకరించడం లేదని, స్పందించడం లేదని చెప్పారు. బాబాకు లోబిపి కొనసాగుతుందని చెప్పారు. కాలేయం పనితీరు మందగించిందని అన్నారు.

కాగా బాబా పరిస్థితి విషమంగా ఉందని తెలియడంతో బాబా భక్తులు భారీగా తరలి వస్తున్నారు. విదేశీయులు కూడా భారీగానే తరలి వస్తున్నారు. దీంతో అప్రమత్తమైన పోలీసు శాఖ విదేశీయులు ఎవరూ పుట్టపర్తి రావద్దని కోరింది. విదేశీయులు బెంగుళూరులోనే ఉండాలని కోరారు.

English summary
Doctors released a bulletin about Sri Sathya Sai Baba health condition today. They said Baba health is very critical.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X