హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఇంటర్ మొదటి సంవత్సరం ఫలితాలలో అమ్మాయిలదే పై చోయి

By Srinivas
|
Google Oneindia TeluguNews

Intermediate Results
హైదరాబాద్: ఇంటర్ మొదటి సంవత్సర ఫలితాలను గురువారం మధ్యాహ్నం 11.30 గంటలకు మంత్రి పార్థసారధి విడదల చేశారు. ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం ఫలితాలలో అమ్మాయిలదే పై చేయిగా ఉంది. ఇంటర్మీడియెట్ మొదటి సంవత్సరంలో మొత్తం ఉత్తీర్ణత శాతం 52.21గా ఉంది. అందులో 56.61 శాతం అమ్మాయిలది కాగు, 48.48 శాతం అబ్బాయిల ఉత్తీర్ణత శాతం ఉంది. మొదటి సంవత్సరం పరీక్షలు రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 8 లక్షల యాభైవేల మంది విద్యార్థులు రాశారు. అందులో 77వేల మంది ఒకేషనల్ విద్యార్థులు పరీక్షలు రాశారు. పరీక్షలు రాసిన వారిలో 4 లక్షల 44వేల మంది విద్యార్థులు పాసయ్యారు.

కాగా ఈ సందర్భంగా పార్థసారధి మాట్లాడారు. ఈ నెల 25వ తారీఖు నుండి మెమోలు అందుబాటులో ఉంటాయని చెప్పారు. స్థానిక ఆర్ఐఓ వద్ద అందుబాటులో ఉంటాయని చెప్పారు. పాసైన వారు ఇంప్రూమెంట్ రాసుకోవచ్చునని అయితే ఫెయిలైతే మాత్రం ఫెయిల్ కిందే లెక్క అని చెప్పారు. కాగా ఫలితాలలో నల్గొండ జిల్లా చివరి స్థానంలో ఉంది. ముందంజలో కృష్ణా జిల్లా ఉంది. నల్గొండ 34 శాతం ఫలితాలు సాధించగా కృష్ణా జిల్లా 70 శాతం ఫలితాలను సాధించింది.

English summary
Minister Parthasarathi released Intermediate first year results today. Girls top in results. Girls percentage 56.61, boys percentage 48.48. Total percentage is 42.21.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X