వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చిరంజీవి పిఆర్పీ విలీనం నిర్ణయం పవన్ కల్యాణ్‌కు తెలియదా?

By Srinivas
|
Google Oneindia TeluguNews

Pawan Kalyan
హైదరాబాద్: ప్రజారాజ్యం పార్టీని మెగాస్టార్ చిరంజీవి కాంగ్రెసు పార్టీలో విలీనం చేస్తున్న నిర్ణయం సోదరుడు, హీరో పవన్ కల్యాణ్‌కు తెలియదా అంటే అవుననే తెలుస్తోంది. పార్టీని కాంగ్రెసులో విలీనం చేయడానికి చిరంజీవి తీసుకున్న నిర్ణయం పార్టీలోని పలువురు ఎమ్మెల్యేలకు మాత్రమే కాకుండా పవన్ కల్యాణ్‌కు కూడా తెలియదని పిఆర్పీ మాజీ మహిళా అధ్యక్షురాలు శోభారాణి వ్యాఖ్యలను బట్టి తెలుస్తోంది. శుక్రవారం పిఆర్పీ విలీనాన్ని అడ్డుకుంటామని చిరుకు ఘాటుగా లేఖ రాసిన శోభారాణి ఆ తర్వాత మీడియాతో మాడ్లాడారు. విలీనం విషయం పవన్ కల్యాణ్‌కు తెలియదని చెప్పారు. పవన్ వ్యక్తిగతంగా చాలా ఉన్నతుడని, గొప్పవాడని అన్నారు. ఆయన ఆలోచనలు చైతన్యవంతంగా ఉంటాయని చెప్పారు.

శోభారాణి వ్యాఖ్యల ద్వారా విలీనం నిర్ణయం తమ్ముళ్లకు చెప్పకుండానే జరిగిందని తెలుస్తోంది. కేవలం బావమరిది అల్లు అరవింద్ నిర్ణయం ప్రకారం తనకు దగ్గరగా ఉన్న సి.రామచంద్రయ్య తదితరులకు మాత్రమే చెప్పి అంతిమ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది. మాజీ పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి వెంట వెళుతున్న పిఆర్పీ ఎమ్మెల్యేలు శోభానాగిరెడ్డి, కాటసాని రాంరెడ్డిలపై వేటుకు కూడా పార్టీ సిద్ధ పడక పోవడానికి కారణం విలీనం విషయం వారికి తెలియక పోవడమే అని తెలుస్తోంది. విలీనాన్ని వ్యతిరేకిస్తూ వాసిరెడ్డి పద్మ కూడా ఇప్పటికే జగన్ పంచన చేరారు.

ముఖ్యంగా పవన్ కల్యాణ్ గత కొన్నాళ్లుగా బయటకు రాక పోవడానికి కారణం కూడా విలీనంపై ఆయనకు తెలియక పోవడమే అని శోభారాణి వ్యాఖ్యల ద్వారా తెలుస్తోంది. ప్రజారాజ్యం పార్టీ అనుకున్నన్ని సీట్లు గెలవనప్పటికీ ముందు ముందు మంచి భవిష్యత్తు ఉంటుందన్న అభిప్రాయం పవన్‌లో ఉందని, అందుకే ఆయనకు విలీనం ఇష్టం లేదనే వాదనలు వినిపించాయి. అందుకే అన్న పార్టీ కోసం అహర్నిషలు శ్రమించిన తమ్ముళ్లు నాగబాబు, పవన్‌లు ప్రస్తుతానికి చిరంజీవికి దూరంగా ఉన్నట్టుగా కనిపిస్తున్నారు.

English summary
PRP senior leader Shoba Rani said today that Hero Pawan Kalyan did not know about merger. She said that she will obstruct PRP merger in Congress.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X