వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఉత్తరాషాడ నక్షత్రంలో దేహం విడిచిన బాబా: ఉదయం 7.28కు మృతి

By Srinivas
|
Google Oneindia TeluguNews

Sathya Saibaba
అనంతపురం: కోట్లాది భక్తుల కొంగు బంగారం భగవాన్ శ్రీ సత్యసాయి బాబా ఆదివారం ఉదయం 7.40 నిమిషాలకు మరణించారు. ఉత్తరాయణం వసంత రుతువు చైత్ర బహుళ సప్తమి ఉత్తరాషాఢ నక్షత్రం నిర్యాణం చెందారని తెలపింది. ఇది మంచి నక్షత్రమని పండితులు అభిప్రాయపడుతున్నారు. బాబా మరణించిన నక్షత్రం చాలా మంచిదని చెబుతున్నారు. కాగా బాబా మరణాన్ని ఉదయం 10.15 గంటల ప్రాంతంలో అధికారికంగా ప్రకటించినట్లుగా తెలుస్తోంది. బాబా పార్థివ శరీరాన్ని భక్తుల సందర్శనార్థం కుల్వంత్ హాల్‌కు నేటి సాయంత్రం తరలించనున్నారు. భక్తుల సందర్శనార్ధం రెండురోజులు అక్కడే ఉంచనున్నారు. ఇవాళ సాయంత్రం 6 గంటల నుంచి మంగళవారం వరకు భక్తుల సందర్శనార్థం కుల్వంత్ హాలులో ఉంచుతారు.

అయితే భక్తులు ఎవరు కూడా బాబాను చూడటానికి వైద్యశాలకు రాకూడదని వైద్యులు కోరుతున్నారు. బాబా మరణం తెలిసిన భక్తులు భారీగా పుట్టపర్తికి తరలి వస్తున్నారు. బాబా మరణం తెలిసిన ప్రముఖులు కూడా పుట్టపర్తికి తరలి వస్తున్నారు. మాజీ ముఖ్యమంత్రులు, ముఖ్యమంత్రులు, రాష్ట్రపతి, ప్రధానమంత్రి తదితరులు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి వేలాదిగా పోలీసులు మోహరించారు. 28 రోజులుగా బాబా ఆసుపత్రిలో ఉన్న అనంతరం బాబా మరణించారు. అయితే బాబా మరణం తెలిసి భక్తులు ఎవరూ అఘాయిత్యాలకు పాల్పడ కూడదని భక్తులను కోరుతున్నారు. బాబా కేవలం శరీరాన్ని మాత్రమే వదిలి వెళ్లారని, ఆయన ఆత్మ మనతోనే ఉన్నదని అంటున్నారు. బాబా భక్తులు ఈ సమయంలో గుండె ధైర్యం చేసుకోవాలని కోరుతున్నారు.

English summary
Bhagvan Sri Sathya Sai Baba passes away today 7.40 am. Baba died in Uttarashada Naskhatram.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X