వరంగల్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

మృతి వార్త సమయం నుండి సత్యసాయిబాబా ఫోటో నుండి తేనె

By Srinivas
|
Google Oneindia TeluguNews

Sathya Saibaba
వరంగల్: భగవాన్ శ్రీ సత్యసాయిబాబా ఫోటో నుండి ఆదివారం ఉదయం నుండి వరంగల్ జిల్లాలోని మహబూబాబాద్ పట్టణంలో తేనె కారుతుంది. బాబా ఫోటో నుండి తేనె కారుతుండటంతో భక్తులు భారీగా తరలి వస్తున్నారు. మహబూబాబాద్‌లో ఉంటున్న బాబా భక్తుడు తిరుమలరావు ఇంటిలో ఈ వింత చోటు చేసుకుంది. తిరుమలరావు ఎండివో కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్‌గా పని చేస్తున్నారు. ఈయన బాబాకు మంచి భక్తుడు. స్థానికంగా ఉన్న భజన మండలి సేవా అధ్యక్షుడిగా కూడా ఆయన ఉంటున్నారు.

అయితే ఆదివారం ఉదయం బాబా మరణించినట్లుగా ప్రకటించిన సమయంలోనే తిరుమలరావు ఇంటిలో బాబా ఫోటో నుండి తేనె కారడం ప్రారంభమవడం మరింత విశేషం. బాబా భౌతికంగా మరణించినప్పటికీ అత్మ రూపంలో మీ వెంట ఉన్నానని చెప్పడానికి ఇలాంటివి చేస్తున్నారని విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు.

English summary
Honey is released from Bhagvan Sri Sathya Sai Baba photo in Mahabubabad of Warangla district today. It occured in Baba's devotee Tirumala Rao residence.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X