వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సత్యసాయి బాబా నిర్యాణం: శోక సముద్రంలో భక్త కోటి

By Srinivas
|
Google Oneindia TeluguNews

Sathya Saibaba
అనంతపురం: కోట్లాది భక్తుల ఆరాధ్య దైవం భగవాన్ శ్రీ సత్యసాయిబాబా ఆదివారం ఉదయం 7.40 నిమిషాలకు మరణించారు. ఈ విషయాన్ని అధికారికంగా ఉదయం 10.15 గంటల ప్రాంతంలో ప్రకటించారు. గత నెల 28న సిమ్స్ హాస్పిటల్లో చేరిన బాబా 28 రోజుల అనంతరం 24వ తేది ఉదయాన మరణించారు. బాబా ఉత్తరాయణం వసంత రుతువు చైత్రబహుళ సప్తమి ఉత్తరాషాడ నక్షత్రంలో నిర్యాణం చెందారు.

బాబా పార్థివ శరీరాన్ని సందర్శించి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, గవర్నర్ నరసింహన్, ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడు తదితరులు నివాళులు అర్పించారు. కాగా బాబాను చూడటానికి మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండుల్కర్ సోమవారం పుట్టపర్తి వెళ్లనున్నారు. బాబా మరణంతో పుట్టపర్తితో పాటు ప్రపంచ వ్యాప్తంగా ఆయన భక్తులు తీవ్ర ఆవేదనలో మునిగి పోయారు. పుట్టపర్తి గ్రామం పూర్తిగా రోధిస్తోంది. భగవాన్ సత్యసాయిని సందర్శించడానికి విదేశీయులు భారీగా వస్తున్నారు.

ఆదివారం సాయంత్రం నుండి మంగళవారం వరకు మూడు రోజుల పాటు భక్తుల దర్శనార్థం పార్థివ దేహాన్ని ఉంచనున్నారు. భక్తులకు ఎప్పుడూ దర్శనమిచ్చే కుల్వంత్ హాలులోనే బాబా దేహాన్ని ఉంచారు. మధ్యాహ్నం 3.05 నిమిషాల ప్రాంతంలో కుల్వంతు హాలుకు తరలించారు. భారీ కాన్వాయ్‌తో బాబా దేహాన్ని తరలించారు. బుధవారం ఉధయం అనగా ఏప్రిల్ 27వ తేదిన బాబా దేహానికి అంత్యక్రియలు జరుపుతారు.

English summary
It seems, Bhagvan Sri Sathya Sai Baba health passes away. Doctors may announced soon.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X