వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సత్యసాయి మరణంతో నిరాడంబరంగా ఐపిఎల్, చీర్ గాళ్స్ లేకుండానే మ్యాచ్

By Srinivas
|
Google Oneindia TeluguNews

Sathya Saibaba
హైదరాబాద్: భగవాన్ శ్రీ సత్యసాయిబాబా మృతి చెందడంతో ఆదివారం డక్కన్ ఛార్జర్స్, ముంబయి ఇండియన్స్ మధ్య జరుగుతున్న ఐపిఎల్ పోరు నిరాడంబరంగా ప్రారంభించారు. చీర్ గాల్స్ నాట్యాన్ని ఈ రోజు వరకు ఇరుజట్ల యజమానులు విరమించుకున్నారు. బాబా భక్తుడు సచిన్ టెండుల్కర్ ఆడతాడా లేడనే చివరి వరకు ఉన్న ఉత్కంఠకు తెలదీస్తూ ఫీల్డ్‌లోకి దిగాడు. తన ఆరాధ్య దైవం మరణించటంతో తీవ్ర నిస్పృలో ఉన్న సచిన్ తను చేయాల్సిన పనిని మాత్రం చిత్తశుద్ధితో నెరవేర్చేందుకు సిద్ధపడ్డాడు. గతంలో తన తండ్రి మరణించిన సమయంలో కూడా సచిన్ ఇలాగే ఆడి అందరికి అదర్శపాయుడిగా నిలిచాడు.

కాగా భగవాన్ శ్రీ సత్యసాయిబాబాను ప్రశాంత నిలయంలోని సాయికుల్వంత్ హాలులో బుధవారం ఉదయం సమాధి చేస్తారు. ఆదివారం సాయంత్రం 6 గంటల నుండి మంగళవారం సాయంత్రం వరకు భక్తుల సందర్శనార్ధం బాబా పార్థివ శరీరాన్ని ఉంచనున్నారు. అయితే వేలాదిగా తరలి వస్తున్న భక్తులతో ప్రశాంత నిలయం కిక్కిరిసి పోతోంది. ఆదివారం మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో బాబా పార్థివ శరీరాన్ని హాస్పిటల్ నుండి ప్రశాంతి నిలయం తరలించారు. అనంతరం 6 గంటల నుండి భక్తులు చూడటానికి అనుమతి ఉంది.

అయితే ఈ లోపే భక్తులు భారీగా అక్కడకు చేరి తమకు బాబాను చూపించాలంటూ ఆందోళన చేశారు. బాబా బంధువులకు కూడా సాయి పార్థివ శరీర దర్శనం లేకపోయే సరికి వారు ప్రశాంత నిలయంలోకి చొచ్చుకెళ్లేందుకు ప్రయత్నించారు. రాష్ట్రవ్యాప్తంగా సాయి మండపాల్లో సాయినామం ఓంకారం మారుమ్రోగుతోంది.

English summary
Baba will be buried at the Sai Kulwant Hall in Prashanti Nilayam on Wednesday in line with the practice adopted for spiritual leaders in India, contrary to the Hindu custom of cremating bodies.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X