కడప వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

డిఎల్‌పై తప్పుడు ప్రచారం: జగన్ పార్టీపై ఈసికి కాంగ్రెసు ఫిర్యాదు

By Srinivas
|
Google Oneindia TeluguNews

YS Jagan
హైదరాబాద్/కడప: ఆరోగ్య శాఖ మంత్రి డిఎల్ రవీంద్రారెడ్డిపై మాజీ పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి పార్టీకి చెందిన వైయస్ఆర్ కాంగ్రెసు పార్టీ వారు తప్పుడు ప్రచారం చేస్తున్నారని కాంగ్రెసు పార్టీ శాసనసభ్యులు సోమవారం ఎన్నికల అధికారి భన్వర్ లాల్‌ను కలిసి ఫిర్యాదు చేశారు. కడప, పులివెందుల, జమ్మలమడుగు తదితర నియోజకవర్గాల్లో కాంగ్రెసు పార్టీ కార్యకర్తలను వైయస్ఆర్ కాంగ్రెసు పార్టీ కార్యకర్తలు వేధిస్తున్నారని ఈసి దృష్టికి తీసుకు వచ్చారు. పలు దిన పత్రికలలో వచ్చే పెయిట్ ఆర్డికల్స్‌ను నియంత్రించాలని వారు కోరారు.

కాగా కడప జిల్లాలో ప్రచారం ఎలా నిర్వహించాలనే ప్రణాళికలో భాగంగా సోమవారం పులివెందుల అసెంబ్లీ అభ్యర్థి వైయస్ వివేకానందరెడ్డి, కడప పార్లమెంటు అభ్యర్థి డిఎల్ రవీంద్రారెడ్డి, మంత్రులు శైలజానాథ్, ఆనం రామనారాయణరెడ్డి తదితరులు భేటీ అయ్యారు. వారు గెలుపుపై ధీమా వ్యక్తం చేశారు. రెండింటిలో కాంగ్రెసు గెలుపు ఖాయమని అంటున్నారు. గెలుస్తే పులివెందుల అభివృద్ధికి కృషి చేస్తానని వివేకా చెప్పారు. దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖరరెడ్డికి అసలైన వారసులం వివేకా తానే అని మంత్రి డిఎల్ రవీంద్రారెడ్డి చెప్పారు.

English summary
Congress MLAs complainted to EC today against Ex MP YS Jagan's YSR congress party. They met EC Bhanwar Lal and told him that YSR Congress is tourchering congress party people.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X