హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

పుట్టపర్తిలో అశాంతి: తన పౌరులను హెచ్చరించిన అమెరికా

By Pratap
|
Google Oneindia TeluguNews

USA
హైదరాబాద్‌: ఆధ్యాత్మిక గురువు సత్య సాయిబాబా మృతితో అనంతపురం జిల్లా పుట్టపర్తిలో పౌర అశాంతి చెలరేగవచ్చునని అమెరికా హోం మంత్రిత్వ శాఖ హెచ్చరించింది. పుట్టపర్తి, బెంగళూర్ సమీపంలోని వైట్ ఫీల్డ్, కొడై కెనాల్, తమళనాడులోని సత్యసాయి ఆశ్రమాలను సందర్సించే తమ దేశ పౌరులు అప్రమత్తంగా ఉండాలని తెలిపింది. ఉద్వేగభరితమైన వాతావరణంలో ఈ ఆశ్రమాల వద్ద ప్రదర్సనలు, గుంపు నియంత్రణ సమస్యలు తలెత్తవచ్చునని తెలిపింది. సత్య సాయిబాబాను కడసారి చూడడానికి హైదరాబాదు నుంచే కాకుండా ఇతర నగరాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో పుట్టపర్తికి చేరుకునే అవకాశం ఉందని తెలిపింది.

పుట్టపర్తి ప్రశాంతి నిలయానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పెద్ద యెత్తున బలగాలను తరలించిందని, బ్యారికేడ్లు ఏర్పాటుచేసిందని, సందర్సకుల ప్రయాణ పత్రాలను తనిఖీ చేస్తున్నారని, పోలీసులు 144వ సెక్షన్ విధించారని, వాణిజ్య సంస్థలను మూసేశారని వివరించింది. ప్రశాంతి నిలయం వద్ద హింస చెలరేగే అవకాశాలు లేవని, అయినా భద్రత పట్ల అమెరికా పౌరులు అప్రమత్తంగా ఉండాలని చెప్పింది. భారీ ప్రజా సమ్మేళనాలు, ప్రదర్శనల వంటి వాటికి దూరంగా ఉండాలని సూచించింది. భారత దేశంలో ఉంటున్న అమెరికా పౌరులు అణెరికా దౌత్య కార్యాలయంలో తమ సమాచారాన్ని నమోదు చేసుకోవాలని చెప్పింది.

English summary
The Department of State warns U.S. citizens to anticipate possible civil unrest around Anantapur in southern Andhra Pradesh following the death on April 24th of the religious leader Sathya Sai Baba. We recommend U.S. citizens avoid traveling to Puttaparthi in Anantapur, as well as Whitefield (near Bangalore) and Kodai Kanal, Tamil Nadu, the sites of two other ashrams, due to the possibility of demonstrations or crowd control issues arising in the emotionally charged atmosphere.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X