వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రేపే శ్రీ సత్య సాయి సెంట్రల్ ట్రస్టు భేటీలో కీలక నిర్ణయం

By Pratap
|
Google Oneindia TeluguNews

Sathya Sai Baba
పుట్టపర్తి: దాదాపు 400 కిలోమీటర్ల మేర విస్తరించి ఉన్న ప్రశాంతి నిలయం విషయంలో తీవ్ర ఉత్కంఠ నెలకొన్న నేపథ్యంలో శ్రీ సత్య సాయి సెంట్రల్ బుధవారం జరిగే భేటీలో కీలక నిర్ణయాలు తీసుకోనుంది. భారీ స్థాయిలో విస్తరించిన పుట్టపర్తి ఆధ్యాత్మిక కేంద్రం విషయంలో ఆశ్రమవాసులు, సిబ్బంది తీవ్ర ఆందోళన చెందుతున్నారు. సాయి బాబా చేపట్టిన విద్య, ఆరోగ్య, సంక్షేమ పథకాలను ట్రస్టు నిర్వహించగలదా, లేదా అనే విషయంపై భక్తుల్లో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

సత్య సాయిబాబా చేపట్టిన సంక్షేమ, అభివృద్ధి పథకాల వల్ల రాష్ట్రంలోని లక్షలాది మంది ప్రయోజనం పొందారు. ఆ కార్యక్రమాలను ట్రస్టు సమర్థంగా నిర్వహిస్తుందో, లేదో ఆనే ఆందోళన భక్తులను చుట్టుముడుతోంది. చెక్ పవర్ ఎవరికిస్తారనే విషయంపై కూడా స్పష్టత లేదు. చెక్ పవర్‌‌ను తాత్కాలికంగా ట్రస్టు కార్యదర్శి చక్రవర్తికి ఇవ్వవచ్చునని ప్రచారం జరుగుతోంది. పూర్తి అధికారాలు సత్యజిత్, ఆర్‌జె రత్నాకర్‌లకు ఉమ్మడిగా ఇచ్చే అవకాశాలు కూడా లేకపోలేదని చెబుతున్నారు. బాబా తన వారసుడిని ప్రకటించకపోవడంతో ప్రస్తుత గందరగోళం చోటు చేసుకుంది.

English summary
While the Sri Sathya Sai Central Trust will meet very soon to take key decisions after Sai Baba's last rites on Wednesday, a sense of anxiety pervades the Prashanti Nilayam spread over 400 acres.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X