• search
  • Live TV
హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

సత్య సాయి బాబా వ్యక్తిగత సహాయకుడు సత్యజిత్ ప్రాణాలకు ముప్పు

By Pratap
|

Sathya Sai Baba
హైదరాబాద్: పుట్టపర్తి సత్య సాయిబాబా వ్యక్తిగత సహాయకుడు సత్యజిత్ ప్రాణాలకు ముప్పు ఉందని రాష్ట్ర ప్రభుత్వ నిఘా విభాగం హెచ్చరించింది. సత్య సాయిబాబా వ్యక్తిగత వైద్యుడు డాక్టర్ అయ్యర్ ప్రాణాలకు కూడా ముప్పు పొంచి ఉందని హెచ్చరించింది. ఈ మేరకు మీడియాలో వార్తలు వస్తున్నాయి. కొంత కాలం పాటు ప్రజలకు ఎక్కువగా కనిపించవద్దని వారిద్దరికి నిఘా విభాగం సూచించింది. బాబాకు సన్నిహితంగా ఉన్న కొంత మందిని హత్య చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని చెప్పింది. ఈ స్థితిలో సత్య సాయి సెంట్రల్ ట్రస్టు సభ్యులకు ప్రభుత్వం భద్రతను పెంచింది.

కాగా, సత్య సాయి సెంట్రల్ ట్రస్టుకు సత్యజిత్ నేతృత్వం పట్లనే ఎక్కువ మొగ్గు చూపుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. బాబా మెడికల్ రికార్డులను సక్రమంగా నిర్వహించలేదని భక్తులు కొంత మంది అయ్యర్‌పై విమర్శలు చేస్తున్నారు. బాబా అస్పత్రిలో ఉన్నప్పుడు అయ్యర్‌కు బెదిరింపు ఫోన్ కాల్స్ కూడా వచ్చాయి. ఈ విషయాలను ప్రశాంతి నిలయం వర్గాలు వెల్లడిస్తున్నాయి.

English summary
With intelligence reports hinting that there was threat to the life of Sathya Sai Baba's caregiver Satyajit and personal doctor Dr Aiyar, the state government on Monday advised both of them to make fewer public appearance for some time.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X