వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పుట్టపర్తి సత్య సాయి మృతిపై మరో వివాదం, శవపేటిక ఆర్డర్‌పై దుమారం

By Pratap
|
Google Oneindia TeluguNews

Sathya Saibaba
పుట్టపర్తి : పుట్టపర్తి సత్య సాయి బాబా మృతిపై మరో వివాదం తలెత్తింది. శ్రీ సత్య సాయి సెంట్రల్ ట్రస్టు శవపేటికకు ఆర్డర్ ఇచ్చిన వైనంపై దుమారం చెలరేగుతోంది. దీనిపై టీవీ చానెళ్లలో వార్తాకథనాలు ప్రసారమవుతున్నాయి. సత్య సాయిబాబా మృతికి 20 రోజుల ముందే శవపేటికకు ఆర్డరిచ్చారని చెబుతున్నారు. అప్పటికే సత్య సాయి బాబా మరణించారా, మరణిస్తారని ఊహించారా అనేది ప్రశ్నగానే మిగిలిపోయింది. అధునాతనమైన శవపేటికకు ఏప్రిల్ 1వ తేదీన ఆర్జరిచ్చినట్లు వెల్లడైంది. హైదరాబాదుకు చెందిన రాజేందర్ రెడ్డి అనే వ్యక్తి శవపేటికకు ఆర్జరిచ్చారని చెబుతున్నారు.

ఏప్రిల్ 1వ తేదీన కోయంబత్తూర్‌ కంపెనీకి ఈ ఆర్డర్ ఇచ్చినట్లు చెబుతున్నారు. ఐదవ తేదీన దాన్ని కర్ణాటక రాజధాని బెంగళూర్‌లోని మల్లేశ్వరంలో గల కుమార్ అండ్ కుమార్ ఇంటర్నేషనల్ కంపెనీ స్వీకరించి, శవపేటికను తయారు చేసిందని చెబుతున్నారు. దాన్ని ఏప్రిల్ 5వ తేదీన హైదరాబాదు మీదుగా పుట్టపర్తి తరలించారని వార్తాకథనాల వెల్లడి. ప్రత్యేక ఎసి సదుపాయం గల శవపేటికను తయారు చేయించినట్లు చెబుతున్నారు. శవపేటిక నమూనాను మెయిల్ ద్వారా పంపినట్లు చెబుతున్నారు.

కాగా, మరో విధమైన కథనం కూడా ప్రచారంలో ఉంది. కన్నడ నటుడు రాజ్‌కుమార్ చనిపోయినప్పుడు తయారు చేసిన శవపేటిక దెబ్బ తిన్నదని, దాంతో దాన్ని పక్కన పడేశారని, దానికే మరమ్మతులు చేసిన పుట్టపర్తికి పంపించారని మీడియాలో ప్రచారమవుతోంది. దాని విలువ 57 వేల రూపాయలుగా చెబుతున్నారు. అందుకు సంబంధించిన రశీదు ప్రతిని టీవీ చానెళ్లలో చూపించారు. సత్య సాయిబాబా శవాన్ని ఉంచిన శవపేటికను టీవీల్లో చూసిన తర్వాత దీన్ని తామే తయారు చేశామని కుమార్స్ అండ్ కుమార్స్ కంపెనీ సిబ్బంది చెప్పడంతో విషయం వెలుగులోకి వచ్చింది.

English summary
A new controversy surrounded the death of Sathya Sai baba. It is about the order of Shavapetika now.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X