వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బాబా సమాధి కోసం పుణ్యక్షేత్రాల నుంచి జలాలు, మట్టి..!!

|
Google Oneindia TeluguNews

Sathya Sai Baba
పుట్టపర్తి: కలియుగ దైవంగా భావించే భగవాన్ శ్రీ సత్య సాయిబాబా భౌతిక కాయానికి నేడు ఉదయం నుండి అంత్యక్రియలు ప్రారంభమయ్యాయి. బాబా పార్థివ శరీరానికి ప్రశాంతి నిలయంలోని కుల్వంత్ హాల్‌లో బాబా సోదరుని కుమారుడు రత్నాకర్ సాంప్రదాయ బద్ధంగా క్రతువు నిర్వహించారు. బుధవారం మధ్యాహ్నం 12 గంటలలోగా బాబాను సమాధి చేయనున్నారు. ఈ తతంగం మొత్తాన్ని సామాన్య ప్రజలు నేరుగా వీక్షించే వీలు లేకుండా చుట్టూ తెరలను కట్టి నిర్వహించారు. కానీ లోపలి వైపు కెమెరాల సాయంతో బయట ఉన్న పెద్ద పెద్ద స్క్రీన్‌లపై యావత్ ప్రజలు వీక్షించే వీలును కల్పించారు.

ఈ కుల్వంత్ హాలులోనే బాబా సాధారణంగా భక్తులకు దర్శనమిస్తుంటారు. ప్రస్తుతం బాబాను ఇదే హాలులో సమాధి చేయనున్నారు. సమాధి ప్రక్రియకు సంబంధించి సన్నాహాలు ప్రారంభమైనాయి. బాబా సమాధి కోసం దేశ వ్యాప్తంగా పవిత్ర స్థలాలుగా భావించే 18 ప్రాంతాల నుండి మట్టిని అక్కడి భక్త సమాజాలు ఇప్పటికే పుట్టపర్తికి చేర్చాయి. గంగ, యమునతో పాటు 7 నదులు, తీర్థాల నుండి కూడా జలాన్ని పుట్టపర్తికి తీసుకువచ్చారు. సమాధి ప్రక్రియలో వీటిని వాడనున్నారు.

పరమ పవిత్ర స్థలమైన కాశీ నుండి అలాగే కర్నాటక రాష్ట్రం నుంచి పలువురు ప్రముఖ వేద పండితులు, వివిధ మఠాధిపతులు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. సాయిబాబాకు అత్యంత ప్రీతి పాత్రమైన ఏనుగు సత్య కీర్తి కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. ఇంకా కార్యక్రమంలో రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, గవర్నర్ నరసింహన్, బిజెపి పార్టీ సభ్యులు బండారు దత్తాత్రేయ, బిజెపి మాజీ అధ్యక్షుడు ఎల్.కే. అద్వానీలతో పాటు పలువురు ప్రముఖులు బాబాకు నివాళులు అర్పించారు. కాగా.. సత్య సాయి బాబాను సమాది చేసిన తర్వత మాత్రమే భక్తులను కుల్వంత్ హాలులోనికి అనుమతించనున్నారు.

English summary
Spiritual leader Sri Sathya Sai Baba's last rites are taking place at the Prashanti Nilayam ashram in his home town of Puttaparthi today. Sai Baba is being buried in the same hall - the Kulwant Hall in the ashram - where his casket was kept for darshan.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X