వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఎవరీ సత్యజిత్, పుట్టపర్తి సత్య సాయి బాబాకు ఎలా దగ్గరయ్యారు?

By Pratap
|
Google Oneindia TeluguNews

Sathya Sai Baba
పుట్టపర్తి : పుట్టపర్తి సత్య సాయిబాబా అస్పత్రిలో చేరడంతో సత్యజిత్ పేరు ఒక్కసారిగా వెలుగులోకి వచ్చింది. ఆయనను వివాదాలు కూడా చుట్టుముట్టాయి. ఆయన ఎవరు, సత్య సాయి బాబాకు ఎలా దగ్గరయ్యారనేది ఆసక్తికరంగా మారింది. సత్య సాయి బాబా వ్యక్తిగత సహాయకుడిగా చెప్తే సరిపోని పరిస్థితి ఏర్పడింది. శ్రీ సత్య సాయి సెంట్రల్ ట్రస్టుకు నేతృత్వం వహించే స్థాయి రావడం వెనక ఉన్న నేపథ్యం ఏమిటనేది చర్చనీయాంశంగా మారింది. ఇప్పటి వరకు ఏ మాత్రం గుర్తింపు లేని విధంగా ఉంటూ వచ్చారు. ఇప్పుడు ఆయన కట్టుదిట్టమైన భద్రత మధ్య తిరగాల్సిన స్థితిలో పడ్డారు.

తమిళనాడుకు చెందిన సత్యజిత్ పుట్టపర్తి విద్యాసంస్థలోనే ఎల్‌కెజి నుంచి ఎంబిఎ వరకు చదివారు. గత పదేళ్లుగా ఆయన సత్య సాయి బాబాతో ఉంటున్నారు. 2003 జూన్ 4వ తేదీన సత్య సాయిబాబా బాత్రూంలో పడిపోయిన సంఘటన వారిద్దరి మధ్య బంధాన్ని పటిష్టం చేసింది. చికిత్స జరుగుతున్నప్పుడు 24 గంటలూ బాబాను అంటి పెట్టుకునే ఉన్నారు. బ్రహ్మచారి అయిన సత్యజిత్ బాబాతో పాటు యజర్ మందిర్‌లోనే ఉండేవాడు. బయటకు వెళ్లినప్పుడు కూడా బాబా వెంటే ఉండేవారు. దీంతో అనతి కాలంలోని ప్రశాంతి నిలయంలో సత్యజిత్ శక్తివంతమైన వ్యక్తిగా మారిపోయారు.

సత్య సాయిబాబాకు గంజిలో నిద్ర మాత్రలు ఇచ్చేవారని, ఇందులో సత్యజిత్ కుట్ర ఉందని, దాంతో సత్య సాయిబాబా ఆరోగ్యం చెడిపోయిందని, ఆరోగ్యం చెడిపోయినా బాబాకు వైద్య సేవలు అందించలేదని బాబా ఆస్పత్రిలో చేరినప్పటి నుంచి ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. దాంతో సత్యజిత్‌కు వ్యతిరేకంగా ఆశ్రమవాసులు, భక్తులు స్పందించడం ప్రారంభించారు. ఆయనకు బెదిరింపు కాల్స్ కూడా వచ్చాయి. ఈ స్థితిలో బాబా వ్యక్తిగత వైద్యుడు అయ్యర్‌కు, సత్యజిత్‌కు భద్రత కల్పించారు. ముందు జాగ్రత్త చర్యగా ట్రస్టు సభ్యులందరికీ భద్రత కల్పించారు.

English summary
When godman Sathya Sai Baba was alive, Satyajit was the apple of his eyes. But, things have changed miraculously in the past few days for him. Now, he cannot move without security.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X