అనంతపురం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

తప్పుడు వార్తలు రాసిన పత్రికపై చట్టపరమైన చర్యలు: నాగానంద్

By Pratap
|
Google Oneindia TeluguNews

Adikesavulu Naidu
పుట్టపర్తి: తప్పుడు వార్తలు రాసిన పత్రికపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని శ్రీ సత్య సాయి సెంట్రల్ ట్రస్టు సభ్యుడు, చార్టెర్డ్ అకౌంటెంట్ నాగానంద్ చెప్పారు. స్వార్థ ప్రయోజనాల కోసం కొంత మంది ట్రస్టుపై అసత్య ప్రచారానికి దిగారని ట్రస్టు సభ్యుడు శ్రీనివాసన్ అన్నారు. సత్య సాయి బాబాకు ఆస్తిపాస్తుల వంటి భవబంధాలు లేవని, భక్తులు మాత్రమే ఉన్నారని ఆయన గురువారం మీడియా ప్రతినిధుల సమావేశంలో చెప్పారు. కోల్‌కతలో ఆస్తుల లావాదేవీలు జరిగినట్లు వచ్చిన వార్తల్లో నిజం లేదని ఆయన చెప్పారు.

దాతల నుంచే ట్రస్టుకు విరాళాలు అందుతున్నాయని ఆయన చెప్పారు. గత నాలుగేళ్లలో మెడికల్ ట్రస్టుకు 130 కోట్ల రూపాయల విరాళాలు వచ్చాయని ఆయన చెప్పారు. ట్రస్టు సభ్యుల్లో ఒకరిని చైర్మన్‌గా ఎన్నుకుంటామని, ప్రక్రియను త్వరలోనే పూర్తి చేస్తామని ఆయన చెప్పారు. ట్రస్టు సభ్యుల మధ్య ఎలాంటి విభేదాలు లేవని ఆయన స్పష్టం చేశారు. ట్రస్టులో హత్యారోపణలపై ప్రభుత్వం ఎప్పుడో విచారణ జరిపిందని ఆయన చెప్పారు.

English summary
Sri Sathya Sai Central trust member Naganad said that legal action will be initiated against a news paper for writing baseless articles.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X