హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఇంటర్మీడియట్‌ సెకండియర్‌లోనూ బాలికలదే పైచేయి, కృష్ణా జిల్లా టాప్

By Pratap
|
Google Oneindia TeluguNews

Intermediate Results
హైదరాబాద్: ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం పరీక్షా ఫలితాల్లోనూ బాలికలదే పైచేయి అయింది. ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం పరీక్షా ఫలితాలను మంత్రి పార్థసారధి గురువారం విడుదల చేశారు. బాలికలు 66. 39 శాతం ఉత్తీర్ణులు కాగా, బాలురు 60.61 శాతం మంది మాత్రమే ఉత్తీర్ణులయ్యారు. పలితాల్లో కృష్ణా జిల్లా టాప్‌లో ఉండగా, నల్లగొండ జిల్లా అన్ని జిల్లాల కన్నా దిగువన ఉంది. కృష్ణా జిల్లా 76 శాతం ఫలితాలు సాధించి అగ్రస్థానంలో నిలిచింది. నల్లగొండ జిల్లాలో 49 శాతం మంది మాత్రమే పాసయ్యారు.

ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం పరీక్ష రాసిన విద్యార్థినీవిద్యార్థుల్లో 63.27 శాతం మంది ఉత్తీర్ణులయ్యారు. నిరుటి కన్నా ఉత్తీర్ణతా శాతం తగ్గింది. మే 2 నాటికి కళాశాలలకు మార్కుల మెమోలను అందిస్తామని పార్థసారథి తెలిపారు. మే 27న ఇంటర్‌ ద్వితీయ సంవత్సరం సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నట్లు మంత్రి వెల్లడించారు. ఇందుకు సంబంధించి సప్లిమెంటరీ పరీక్ష ఫీజు చెల్లింపునకు మే 5 ఆఖరి గడువని చెప్పారు.

English summary
Girl students over through boys in Intermediate second year examination results. 66.39 percent girl students passed as against 60.61 percent of boys.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X