అనంతపురం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

చెడ్డ పేరు తెచ్చేందుకే ఆరోపణలు, అంతా తేటతెల్లమే: ట్రస్టు

By Pratap
|
Google Oneindia TeluguNews

Sathya Sai Baba
పుట్టపర్తి: ట్రస్టుకు చెడ్డ పేరు తెచ్చేందుకే ఆరోపణలు చేస్తున్నారని శ్రీ సత్య సాయి సెంట్రల్ ట్రస్టు వ్యాఖ్యానించింది. ఇరవై ఏళ్ల తర్వాత గురువారం శ్రీ సత్య సాయి సెంట్రల్ ట్రస్టు సభ్యులు తొలి సారి మీడియా ప్రతినిధుల సమావేశంలో మాట్లాడారు. ట్రస్టు ప్రతిష్టను దెబ్బ తీయడానికి నిరాధారమైన, అసత్య వార్తాకథనాలను ప్రసారం చేశారని ట్రస్టు సభ్యుడు మద్రాసు శ్రీనివాసన్ విమర్సించారు. ట్రస్టు సభ్యుల తరఫున ఆయన మీడియా ప్రతినిధుల సమావేశంలో మాట్లాడారు. శ్రీ సత్య సాయిబాబా సెంట్రల్ ట్రస్టు కార్యకలాపాలపై, దానికి ఉన్న ఆస్తులపై ఆయన సవివరమైన ప్రకటన చేశారు. తాము బాబా ఆరోగ్యంపై తాము దృష్టి పెట్టామని, బాబా అనారోగ్యం కారణంగానే తాము ఇంత కాలం మీడియాతో మాట్లాడలేకపోయామని ఆయన అన్నారు.

ట్రస్టు ఆస్తులను మీడియా ఎక్కువ చేసి చూపిందని ఆయన అన్నారు. తమ కార్యకలాపాలకు సత్య సాయి బాబా ఏ విధమైన విరాళాలు అడగలేదని ఆయన అన్నారు. వైద్య, విద్యా సేవలపై తాము దృష్టి పెట్టామని ఆయన చెప్పారు. ట్రస్టు ఎక్కడెక్కడ ఏయే విద్యా, వైద్యపరమైన సేవలు అందిస్తున్నదీ ఆయన వివరించారు. సత్య సాయి ట్రస్టు చేపట్టిన మంచినీటి ప్రాజెక్టుల గురించి వివరించారు. ఈ సేవా కార్యక్రమాలన్నీ దేశ, విదేశాల నుంచి వచ్చే విరాళాలతో సాగుతున్నాయని ఆయన అన్నారు. తాము ఏ విధమైన చట్ట ఉల్లంఘనలకు పాల్పడలేదని ఆయన స్పష్టం చేశారు. ఎప్పటికప్పుడు జమాఖర్చుల లెక్కలు జరుగుతున్నాయని, ఆడిట్ ఎప్పటికప్పుడు జరుగుతూనే ఉన్నదని ఆయన చెప్పారు.

దేశవ్యాప్తంగా ట్రస్టు నిర్వహిస్తున్న కార్యకలాపాల గురించి, వాటి ఆస్తుల గురించి ఆయన వివరించారు. ఆస్తులను వాణిజ్య కార్యకలాపాలకు వాడడం లేదని, కేవలం సేవా కార్యక్రమాలకు మాత్రమే వాడుతున్నామని ఆయన చెప్పారు. తాము కొన్న భూములకు లెక్కలు, రశీదులు ఉన్నాయని ఆయన చెప్పారు. ఆస్తుల విలువను చెప్పడం సాధ్య కాదని, ఏం చెప్పినా ఊహాజనితమే అవుతుందని ఆయన అన్నారు.

English summary
Sri Sathya Sai Central Trust condemned the reports on trust properties. Trust member Madras Srinivasan said that the allegations are baseless.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X