హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

చిరంజీవితో శోభారాణి మెగా ఫైట్: ఈసికి అధినేతపైనే ఫిర్యాదు

By Srinivas
|
Google Oneindia TeluguNews

Shobha Rani
హైదరాబాద్: ప్రజారాజ్యం పార్టీ మహిళా నాయకురాలు శోభారాణి తమ పార్టీ అధినేత చిరంజీవిపై పోరాటానికి సిద్ధమయినట్లుగా కనిపిస్తోంది. గురువారం శోభారాణి ఎన్నికల సంఘ అధికారులను కలిశారు. ఎన్నికల సంఘానికి చిరంజీవిపై ఫిర్యాదు చేశారు. చిరంజీవి వ్యక్తిగత స్వార్థం కోసం ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెసు పార్టీలో విలీనం చేస్తున్నారంటూ ఆమె ఫిర్యాదు చేసింది. సామాజిక న్యాయం అంటూ ప్రజలను నమ్మించి, గత సాధారణ ఎన్నికలలో ఏ పార్టీని అయితే తిట్టారో ఆ పార్టీలో విలీనం చేయడాన్ని ఆమె ప్రశ్నించారు. చిరంజీవి నుండి పార్టీని పీఆర్పీ నేతలకు అప్పగించాలని ఆమె ఈసిని కోరారు.

కాంగ్రెసు పార్టీలో ప్రజారాజ్యం పార్టీ విలీనంపై స్పందించాలని ఆమె చిరంజీవిని కోరారు. పీఆర్పీకి ఓటు వేసిన వారికి సామాజిక న్యాయం చేయాలంటే పీఆర్పీ విలీనాన్ని ఆపాల్సిందేనని అన్నారు. చిరంజీవి విలీనంపై పునరాలోచించాలని ఆమె సూచించారు. తనకు చిరంజీవి నుండి వారంలోగా స్పందన కనిపించాలని డెడ్ లైన్ విధించారు. అప్పటిలోగా స్పందించకుంటే తాను నిరాహార దీక్షకు దిగుతానని హెచ్చరించారు.

English summary
PRP senior leader Shobha Rani is ready to fight with president Chiranjeevi. She blamed him for merger of PRP in Congress. She complained at EC to handling PRP to party followers.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X