వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వైభవంగా ప్రిన్స్ విలియమ్స్, కేట్‌ పెళ్లి: వైట్ డ్రెస్‌లో మెరిసిన మిడిల్‌టన్

By Srinivas
|
Google Oneindia TeluguNews

Prince Williams-Kate Middleton
లండన్: బ్రిటన్ యువరాజు విలియమ్స్, కేట్ మిడిల్‌టన్‌ల వివాహం శుక్రవారం మధ్యాహ్నం అంగరంగ వైభవంగా జరిగింది. విలియమ్స్, కేట్‌లను 1902 నాటి వింటేజ్ కారులో ఊరేగింపుగా వెస్ట్ మినిస్టర్స్ ఎబె చర్చికి తీసుకు వచ్చారు. వీరి వివాహానికి 1900 మంది అతిథులను అహ్వానించారు. యువరాజుకు శుభాకాంక్షలు చెప్పడానికి బకింగ్ హ్యామ్ ప్యాలెస్ నుండి వెస్ట్ మినిస్టర్స్ ఎబె చర్చ్ వరకు బ్రిటన్ ప్రజలు బారులు తీరారు. లండన్‌లో అయితే ప్రజల సందడే సందడి. యువరాజు పెళ్లి సందర్భంగా బ్రిటన్ ప్రభుత్వం సెలవు దినంగా అధికారికంగా ప్రకటించింది. దేశ విదేశాల నుండి అతిథులు వచ్చారు. డయానాకు తగిన కోడలుగా అందరూ అభివర్ణిస్తున్నారు. కాగా ముప్పయ్యేళ్ల తర్వాత రాజ కుటుంబంలో పెళ్లి వేడుక చోటు చేసుకోవడం బ్రిటన్ ప్రజల ఆనందానికి అంతే లేకుండా పోయింది.

విలియమ్స్, కేట్‌ల వివాహాన్ని ప్రపంచవ్యాప్తంగా సుమారు 200 కోట్ల మంది చూశారని అంచనా. వైట్ డ్రెస్‌లో పెళ్లి కూతురు కేట్ మెరిసి పోయింది. ఈ పెళ్లికి సుమారు రూ.500 కోట్లు ఖర్చయినట్లుగా తెలుస్తోంది. వీరి పెళ్లి కేవలం బ్రిటన్‌లోనే కాదు ప్రపంచవ్యాప్తంగా హడావుడి సృష్టించింది. లండన్ నగరాన్ని సర్వాంగ సుందరంగా తీర్చి దిద్దారు. నెలల ముందు నుండే ఏర్పాట్లు ప్రారంభించారు. కాగా పలువురు అంతరిక్షం నుండి శుభాకాంక్షలు తెలిపారు.

English summary
The royal wedding between Kate Middleton and Prince William has begun at Westminster Abbey. The two will exchange vows shortly in a royal occasion of dazzling pomp and pageantry that has attracted a huge global audience.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X