వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సిఎం గాలింపుకు వాతావరణం అడ్డంకి: శాటిలైట్ ఫోటోల ద్వారా గుర్తింపుకు యత్నం

By Srinivas
|
Google Oneindia TeluguNews

Dorjee Khandu
ఈటానగర్‌: అరుణాచల్‌ ప్రదేశ్‌ ముఖ్యమంత్రి దోర్జీ ఖండూ ఆచూకీపై ఉత్కంఠ వీడలేదు. ఆయన ఆచూకీ కోసం రెండో రోజు గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఖండూ ప్రయాణిస్తున్న హెలికాప్టర్‌ శనివారం ఉదయం గల్లంతైన విషయం తెలిసిందే. తవాంగ్ ఆచూకీ ఇప్పటి వరకు దొరకక పోవడంతో కేంద్రం ఇస్రో ద్వారా అరుణాచల్ ప్రదేశ్ రాజధాని ఈటానగర్ నుండి తవాంగ్ వరకు ఫోటోలు తీయించింది. ఆ ఫోటోలు ఇస్రో వారు పరిశీలించి ఆదివారం మధ్యాహ్నం వరకు హెలికాప్టర్ ఎక్కడ ఉందో విషయాన్ని చెప్పే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. విదేశాంగ శాఖమంత్రి ఎంఎస్ కృష్ణ దోర్జిని వెతికే క్రమంలో భూటాన్ సహాయం కోరారు. భూటాన్, భారత్ రెండు దేశాలు డోర్జీ గురించి వెతుకులాడుతున్నాయి. రెండు సుఖోయ్ విమానాలు, 30 ఎయిర్ క్రాఫ్ట్ విమానాలు ముఖ్యమంత్రి కోసం వెతుకులాట ప్రారంబించాయి. కేంద్రం ఇద్దరు మంత్రులను అరుణాచల్ ప్రదేశ్ పంపించింది. అయితే గాలింపుకు వాతావరణం అనుకూలించడం లేదు.

కాగా ఆయనతోపాటు మరో నలుగురు హెలికాప్టర్‌లో ప్రయాణిస్తున్నారు. తవాంగ్‌ నుంచి శనివారం ఉదయం 9.56 గంటలకు బయల్దేరిన హెలికాప్టర్‌ 11.30 గంటలకు ఈటానగర్‌ చేరాలి. అయితే బయలుదేరిన 20 నిమిషాలకే సీలా సాస్‌ మీదుగా ఎగురుతున్నప్పుడు హెలికాప్టర్‌తో సంబంధాలు తెగిపోయాయి. సీఎం ఆచూకీ కోసం శనివారం చేసిన ప్రయత్నాలు వాతావరణం సరిగా లేక ఫలించలేదు. దీంతో ఈ ఉదయం సైన్యం, ఎస్‌ఎస్‌బీ, ఐటీబీపీ దళాలు తీవ్రంగా గాలింపు చర్యలు మొదలుపెట్టాయి. వైమానిక దళం కూడా గగనతలం నుంచి గాలింపు చర్యలు చేపట్టింది. ఖండూ అన్వేషణ కోసం భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రోను కేంద్ర ప్రభుత్వం అప్రమత్తం చేసింది.

English summary
Inclement weather today affected the aerial search to trace the missing helicopter carrying Arunachal Pradesh chief minister Dorjee Khandu and four others even as the Army, SSB, ITBP and the state police launched a massive ground operations to locate it.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X