వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చిరు వద్దకు వచ్చిన జగన్ ఎమ్మెల్యేల పేర్లు చెప్పడానికి సిద్ధం: కోటగిరి

By Srinivas
|
Google Oneindia TeluguNews

Kotagiri Vidyadhar Rao
హైదరాబాద్: మాజీ పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేయాలని ప్రజారాజ్యం పార్టీ అధ్యక్షుడు చిరంజీవిని దివంగత వైయస్ రాజశేఖరరెడ్డి మరణించిన సమయంలో కలిసిన ఎమ్మెల్యేల పేర్లు బయట పెట్టడానికి తాను సిద్ధంగా ఉన్నానని ఆ పార్టీ సీనియర్ నాయకుడు కోటగిరి విద్యాధరరావు ఆదివారం అన్నారు. కాంగ్రెసులో పీఆర్పీ విలీనం దివంగత వైయస్ కోరికే అన్నారు. పీఅర్పీ కాంగ్రెసులో కలిస్తే తనకు రాజకీయ భవిష్యత్తు ఉండదనే భయంతోనే జగన్ బయటకు వెళ్లి పార్టీ పెట్టుకున్నాడని ఆరోపించారు.

జగన్, బిజెపిలకు లోపాయకారి ఒప్పందం ఉందని ఆరోపించారు. కాంగ్రెసు జగన్‌కు అన్యాయం చేయలేదన్నారు. జగనే కాంగ్రెసుకు వెన్నుపోటు పొడిచారన్నారు. వైయస్ కుటుంబాన్ని చీల్చింది కాంగ్రెసు కాదన్నారు. అధికార దాహంతో జగనే కుటుంబాన్ని ముక్కలు చేశారన్నారు. బాబాయికి పదవి ఇస్తే సహించలేక పోయిన వాడు జగన్ అన్నారు.

English summary
PRP senior leader Kotagiri Vidyadhar Rao said today that he will ready to reveal MLAs name, who met PRP president Chiranjeevi in YS Jagan's CM issue.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X