• search
  • Live TV
కడప వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

వైయస్ జగన్‌వి సినిమా డైలాగులు, చూస్తూ ఊరుకోని: చిరంజీవి

By Srinivas
|

Chiranjeevi
కడప: మాజీ పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి సినిమా డైలాగులు చెబుతున్నారని ప్రజారాజ్యం పార్టీ అధ్యక్షుడు చిరంజీవి సోమవారం కమలాపురం నియోజకవర్గంలో జగన్‌ను ఉద్దేశించి ఎద్దేవా చేశారు. ప్రభుత్వాన్ని పడగొడతానంటూ సినిమా డైలాగులు కొడుతున్నాడన్నారు. పడగొట్టి చూపించాలని అన్నారు. పడగొట్టడం, కూలగొట్టడం వ్యక్తిగతానికి సంబంధించినది కాదని రాష్ట్ర ప్రజల జీవితానికి సంబంధించినదన్నారు. ప్రభుత్వాన్ని పడగొడుతుంటే చూస్తు కూర్చోనని అన్నారు. ప్రజల భవిష్యత్తు కోసం జగన్ పడగొట్టాలని చూస్తే నేను నిలబెడతానని చెప్పారు. ప్రభుత్వాన్నే కాదు రాష్ట్రంలో కాంగ్రెసును నిలబెట్టేది కూడా తానేనని చెప్పారు.

కాగా ఎమ్మెల్యే వీరశివారెడ్డి కూడా జగన్‌పై ధ్వజమెత్తారు. చిరంజీవి, చంద్రబాబులపై దాడి చేయించి కడప జిల్లా పరువు తీశారని అన్నారు. చిరుకు వస్తున్న ఆదరణ చూసి ఓర్చుకోలేకనే ఆయన ఈ దుశ్చర్యలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. చిరుకు వస్తున్న స్పందన జగన్ వెన్నులో వణుకు పుట్టిస్తుందన్నారు.

English summary
PRP president Chiranjeevi accused that Ex MP YS Jaganmohan Reddy commenting like cinema dialogues. Congress MLA Veerashiva Reddy also blamed YS Jagan for attacking on Chiru and Chandrababu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X