వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

లాడెన్‌పై దాడితో మాకు ప్రత్యక్ష సంబంధం లేదు: పాకిస్తాన్ ప్రభుత్వ ప్రకటన

By Pratap
|
Google Oneindia TeluguNews

Osama Bin Laden
ఇస్లామాబాద్: ఆల్ ఖైదా వ్యవస్థాపకుడు ఒసామా బిన్ లాడెన్ మృతికి కారణమైన అమెరికా దాడితో తమకు ప్రత్యక్ష సంబంధం లేదని పాకిస్తాన్ ప్రభుత్వం ప్రకటించింది. నలబై నిమిషాల ఆపరేషన్‌ను అమెరికా హెలికాప్టర్లే జరిపాయని తెలిపింది. ప్రపంచంలో ఎక్కడ ఉన్నా లాడెన్‌ను తాము ప్రత్యక్షంగా దాడి చేసి చంపుతామని ప్రకటించిన తన విధాన నిర్ణయం మేరకే అమెరికా బలగాలు ఆపరేషన్ నిర్వహించాయని తెలిపింది.

ఒసామా బిన్ లాడెన్‌ను తమ ఆపరేషన్‌లో చంపినట్లు అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా ఫోన్ చేసి చెప్పారని ఆ ప్రకటనలో తెలిపారు. పాకిస్తాన్‌తో పాటు అంతర్జాతీయ సమాజం ఉగ్రవాదాన్ని నిర్మూలించాల్సిన అవసరాన్ని లాడెన్ మృతి తెలియజేస్తోందని ప్రకటించింది. ఈ సంఘటన ప్రపంచవ్యాప్తంగా ఉగ్రవాదానికి ఎదురు దెబ్బ అని వ్యాఖ్యానించింది. పాకిస్తాన్‌పై లాడెన్ యుద్ధం ప్రకటించాడని, ఆల్ ఖైదా విచక్షణారహితమైన దాడుల్లో పాకిస్తాన్‌కు చెందిన వేలాది మంది ఆమాయక ప్రజలు, మహిళలు, పిల్లలు మరణించారని చెప్పింది.

గత కొన్నేళ్లలో ఉగ్రవాదుల దాడిలో 30 వేల మంది పాకిస్తానీ పౌరులు మరణించినట్లు తెలిపింది. దాదాపు 5వేల మంది భద్రతాధికారులు, సైనికులు అమరులయ్యారని చెప్పింది. ఉగ్రవాదాన్ని అంతం చేయడంలో పాకిస్తాన్ సమర్థవంతమైన పాత్రను పోషించిందని సమర్థించుకుంది. తమ భూభాగంలో ఉగ్రవాద చర్యలను అనుమతించబోమని స్పష్టం చేసింది.

English summary
In a statement issued by the Pakistan government, it said it was not directly involved with the raids that led to Osama bin Laden's death this morning. The 40-minute military operation was carried out by four US helicopters.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X