హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఆక్రమణలు ఆపడానికి ప్రయత్నించినందునే అక్బరుద్దీన్‌పై దాడి: ఖాన్

By Pratap
|
Google Oneindia TeluguNews

AK Khan
హైదరాబాద్: ప్రభుత్వ భూముల ఆక్రమణను ఆపడానికి ప్రయత్నించినందు వల్లనే మజ్లీస్ శాసనసభ్యుడు అక్బరుద్దీన్ ఓవైసీపై దాడి జరిగిందని హైదరాబాద్ పోలీసు కమిషనర్ ఎకె ఖాన్ చెప్పారు. అక్బరుద్దీన్‌పై దాడి కేసులో నిందితులను ఆయన మంగళవారం సాయంత్రం మీడియా ముందు ప్రవేశపెట్టారు. ఆస్పత్రిలో ఉన్న ఇద్దరితో పాటు మొత్తం తమ అదుపులో తొమ్మిది మంది నిందితులున్నారని ఆయన చెప్పారు. మరో ఐదారుగురిని అరెస్టు చేయాల్సి ఉందని ఆయన చెప్పారు. కొంత మందిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నామని ఆయన చెప్పారు.

తాను భద్రత కల్పిస్తామని చెప్పామని, అక్బరుద్దీన్ అందుకు నిరాకరించారని ఆయన చెప్పారు. నిందితులపై ఏడు సెక్షన్ల కింద కేసు నమోదు చేశామని ఆయన చెప్పారు. దాడి జరిగిన సమయంలో అక్బరుద్దీన్‌కు గన్‌మెన్ లేరని ఆయన చెప్పారు. అక్బరుద్దీన్‌కు, మహ్మద్ పహిల్వాన్‌కు మధ్య విభేదాలు, ఘర్షణలు ఉన్నాయని ఆయన అన్నారు. అక్బరుద్దీన్ హత్యకు కుట్ర జరిగిందా అనే కోణంలో కూడా దర్యాప్తు సాగుతోందని ఆయన చెప్పారు. డిసిపి సత్యనారాయణ ఆధ్వర్యంలో దర్యాప్తునకు ఓ బృందాన్ని ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు.

English summary
Hyderabad police commissioner AK Khan said that 9 culprits were arrested in attack on MIM MLA Akbaruddin case. He said that land dispute is main reason for attack on Akbaruddin.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X