హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

సాలార్‌జంగ్ మ్యూజియంలో హసన్ అలీ దొంగతనం: కేసు నమోదు

By Srinivas
|
Google Oneindia TeluguNews

Hasan Ali
హైదరాబాద్: సాలార్జంగ్ మ్యూజియంలో పలు విలువైన వస్తువులు దొంగిలించిన కేసులో నల్ల డబ్బు కుంభకోణంలో అరెస్టు అయిన హసన్ అలీ మీద హైదరాబాదులోని సిసిఎస్ పోలీసు స్టేషన్లో మంగళవారం కేసు నమోదయింది. హసన్ అలీ హైదరాబాదులోని సాలార్‌జంగ్ మ్యూజియం నుండి పలు విలువైన వస్తువులను దొంగిలించి దేశం దాటించినట్లుగా మంబయి ఎన్ఫోర్స్‌మెంట్ డిపార్ట్‌మెంట్ పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు. దీంతో వారు హైదరాబాదులోని సిసిఎస్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అలీ మ్యూజియం నుండి 1995 నుండి 2000 సంవత్సరాల మధ్య కాలంలో పలు వస్తువులు దొంగిలించారని సిసిఎస్‌కు చెప్పారు. దీంతో సిసిఎస్ పోలీసులు హసన్ ఆలీపై దొంగతనం కేసు పెట్టారు.

అయితే ఈ దొంగతనం హసన్ అలీ ఒక్కడే చేయలేడు. కాబట్టి అప్పటి అధికారులకు ఏమైనా సంబంధాలు ఉన్నాయా అనే అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. మ్యూజియం నుండి ఎన్ని వస్తువులు పోయాయనే విషయంలో స్పష్టత లేనట్టుగా తెలుస్తోంది. సిసిఎస్‌లో ఈడి ఫిర్యాదు చేసిందని కేసు నమోదు చేసి విచారణ జరిపిస్తున్నామని సిసిఎస్ డిసిపి సత్యనారాయణ చెప్పారు.

English summary
Enforcement department suspected that Hasan Ali, who arrested in money landering was stolen valuable articles from Salarjung Museum. ED officers from Mumbai were complained to CCS of Hyderabad against Hasan Ali.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X