వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

లాడెన్‌పై దాడిలో మేం పాల్గొనలేదు, సంయుక్త ఆపరేషన్ కాదు: జర్దారీ

By Pratap
|
Google Oneindia TeluguNews

Asif Ali Zardari
వాషింగ్టన్: అంతర్జాతీయ ఉగ్రవాది ఒసామా బిన్ లాడెన్‌పై దాడిలో తాము పాల్గొనలేదని, అది సంయుక్త ఆపరేషన్ కాదని పాకిస్తాన్ అధ్యక్షుడు అసిఫ్ అలీ జర్జారీ స్పష్టం చేశారు. తాను వాషింగ్టన్ పోస్టుకు రాసిన కాలమ్‌లో ఆయన ఆ విషయం స్పష్టం చేశారు. తమ దేశంలోని ఉగ్రవాదులపై తాము చర్యలు తీసుకోలేకపోయామనే అభిప్రాయంలో నిజం లేదని ఆయన అన్నారు. లాడెన్ ఎక్కుడున్నాడనే విషయం పాకిస్తాన్ అధికారులకు తెలియదని ఆయన అన్నారు. అతడు ఎక్కుడైనా ఉండవచ్చునని తాము ఊహిస్తూ వచ్చామని, ఇప్పుడతను లేడని జర్దారీ అన్నారు.

పౌర ప్రపంచానికి ముప్పుగా పరిణమించిన లాడెన్ అంతం అమెరికా, పాకిస్తాన్ మధ్య దశాబ్ద కాలంగా కొనసాగుతున్న సహకారం, భాగస్వామ్యం వల్లనే సాధ్యమైందని ఆయన అన్నారు. మిలిటెంట్ల చర్యల్లో 30 వేల మందికి పైగా కోల్పోయిన తమ దేశానికి ఉగ్రవాదులపై చర్య తీసుకోవడం ఇష్టం లేదనే మాటల్లో నిజం లేదని ఆయన అన్నారు.

English summary
The killing of Osama bin Laden by US forces was not a joint operation with Pakistan, the president of Pakistan said in an opinion column published on Monday. President Asif Ali Zardari, writing in the Washington Post, also dismissed any notion that Pakistan was failing to take action against milita.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X