వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

లాడెన్ మృతికి ప్రతీకారం తప్పదన్న తాలిబాన్లు: హిట్ లిస్టులో జర్దారీ

By Pratap
|
Google Oneindia TeluguNews

Osama Bin Laden
ఇస్లామాబాద్: ఆల్ ఖైదా వ్యవస్థాపకుడు ఒసామా బిన్ లాడెన్ మృతికి ప్రతీకారం తీర్చుకుంటామని పాకిస్తానీ తాలిబాన్లు మంగళవారం హెచ్చరించారు. అజ్ఞాత ప్రదేశం నుంచి తెహ్రీక్ - ఎ - తాలిబాన్ పాకిస్తాన్ అధికార ప్రతినిధి అహసనుల్లా అహసన్ ఆడియో సందేశాన్ని విడుదల చేశారు. లాడెన్ మృతిని అతను ధ్రువీకరించాడు. లాడెన్ హత్యకు ప్రతీకారం తీర్చుకుంటామని చెప్పాడు.

తమ తొలి లక్ష్యం పాకిస్తాన్ అని, అమెరికా రెండో లక్ష్యమని అతను చెప్పాడు. పాకిస్తాన్ నాయకులు తమ హిట్ లిస్టులో ఉన్నట్లు తెలిపాడు. పాకిస్తాన్ అధ్యక్షుడు ఆసిఫ్ అలీ జర్జారీతో పాటు పాకిస్తాన్ నాయకులు, సైనికాధికారులు తమ హిట్ లిస్టులో ఉన్నట్లు జర్నలిస్టులకు ఫోన్ చేసి అహసన్ చెప్పాడు. మూడు నెలలు పథకం వేసి పాకిస్తాన్ మాజీ ప్రధానిని తాము హతమార్చామని అతను చెప్పాడు. భుట్టోను చంపడానికి తాము ఆత్మాహుతి దళ సభ్యుడిని పంపినట్లు తెలిపాడు.

English summary
The Pakistani Taliban Tuesday warned that they would target Pakistan and the US to avenge the killing of al Qaeda chief Osama bin Laden by US special forces in a raid near the garrison city of Abbottabad.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X