హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

అక్బరుద్దీన్ పై దాడి కేసులో నిందితులకు 14 రోజుల రిమాండ్

By Srinivas
|
Google Oneindia TeluguNews

Akbaruddin Owaisi
హైదరాబాద్: ఎంఐఎం పార్టీ శాసనసభా పక్షనేత అక్బరుద్దీన్ ఓవైసీపై దాడి చేసిన ఏడుగురు నిందితులకు కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. దీంతో పోలీసులు నిందితులను చర్లపల్లి జైలుకు తరలించింది. భద్రతా కారణాల దృష్ట్యా నిందితులను బుధవారం ఉదయాన్నే జస్టిస్ జోషి ముందు నిలబెట్టారు. జోషి వారికి 14 రోజుల రిమాండ్ విధించారు. అక్బరుద్దీన్ పై దాడి చేసిన వారిలో తొమ్మిది మంది ఉన్నట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు. ఇందులో ఏడుగురిని మంగళవారం అరెస్టు చేసినట్టు నగర పోలీసు కమిషనర్ ఎకె ఖాన్ చెప్పారు. ఈ రోజు వారిని జడ్జి ముందు ఉంచారు.

కాగా అరెస్టయి జైలు పాలయిన వారిలో ఎంబిటి నేత, అక్బరుద్దీన్ ప్రధాన ప్రత్యర్థి మహమ్మద్ పహిల్వాన్, హుస్సేన్ బిన్ ఉమర్, యాహ్యా బిన్ యూనస్, ఇసాబిన్ యూనస్, పైసల్ బిన్ అహ్మద్, ఫజల్ బిన్ అహ్మద్, యూనస్ బిన్ ఉమర్‌లు ఉన్నారు. కాగా మరో ఇద్దరు పరారీలో ఉన్నట్లుగా తెలుస్తోంది.

English summary
Seven accused in MIM MLA Akbaruddin Owaisi were remanded for 14 days. Justice Joshi was declared their remand on wednesday morning. They sent to Cherlapalli Jail.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X