వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మళ్లీ పెళ్లి వద్దని, కొడుకులు ఆల్ ఖైదాలోకి వద్దని భార్యలకు చెప్పిన లాడెన్

By Pratap
|
Google Oneindia TeluguNews

Osama Bin Laden
న్యూఢిల్లీ: తన మరణం తర్వాత మళ్లీ పెళ్లి చేసుకోవద్దని, తన పిల్లలను ఆల్ ఖైదాలో చేర్చవద్దని అంతర్జాతీయ ఉగ్రవాది ఒసామా బిన్ లాడెన్ కోరినట్లు ఓ వార్తాపత్రిక రాసింది. ఈ మేరకు ఆయన తన వీలునామాలో రాసినట్లు కువైట్ వార్తాపత్రిక ఆల్ - అంబా తెలిపింది. ఈ వీలునామాను వ్యక్తిగతమూ రహస్యమూ అంటూ చెప్పాడని, దాన్ని అమెరికాపై దాడుల తర్వాత 2001 డిసెంబర్ 14వ తేదీన రాశాడని తెలిపింది. ఈ సమయంలో లాడెన్ కోసం అమెరికా బలగాలు అఫ్షనిస్తాన్‌లో వేట సాగిస్తున్నాయి.

కంప్యూటర్‌పై రాసిన ఆ వీలునామాపై లాడెన్ సంతకం చేశాడని ఆ పత్రిక రాసింది. తన చుట్టూ ఉన్నవారి చేతిలో తాను హతం కావచ్చునని కూడా అతను రాసినట్లు తెలిపింది. అయితే, ఆ వీలునామా ప్రతిని తాము ఎలా సంపాదించామనే విషయాన్ని ఆ పత్రిక తెలియజేయలేదు. సౌదీకి చెందిన అరబిక్ మ్యాగజైన్ ఇటువంటి డాక్యుమెంటునే 2002లో ప్రచురించింది. అయితే, నకిలీ డాక్యుమెంటు అని తేలింది. తగిన సమయాన్ని ఇవ్వనందుకు తనను క్షమించాలని లాడెన్ తన కుమారులను కోరినట్లు కూడా ఆ పత్రిక రాసింది.

English summary
Osama Bin Laden's last wish, according to a document purported to be his will, was that his wives not remarry after his death and his children not join al-Qaida.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X