వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

లాడెన్ ఇంటిని కట్టిన కాంట్రాక్టర్‌ను అదుపులోకి తీసుకున్న పాకిస్తాన్

By Pratap
|
Google Oneindia TeluguNews

Osama Bin Laden
ఇస్లామాబాద్: తమ దేశంలోని అబ్బొత్తాబాద్‌ పట్టణంలో ఆల్ ఖైదా వ్యవస్థాపకుడు ఒసామా బిన్ లాడెన్ నివాసం ఉన్న మూడంతస్థుల ఇంటిని కట్టిన కాంట్రాక్టర్‌ను పాకిస్తాన్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. నిఘా వర్గాలు ఈ విషయాన్ని వెల్లడించాయి. ఒబ్బొత్తాబాద్‌కు 35 కిలోమీటర్ల దూరంలో ఉన్న బత్తాగ్రామ్ పట్టణంలో నివాసం ఉంటున్న 45 - 50 ఏళ్ల వయస్సు గల గుల్ మదాహ్ అనే కాంట్రాక్టర్‌ 2005లో ఆ భవనాన్ని నిర్మించాడు.

గుల్ మదాహ్‌ను అబ్బొత్తాబాద్‌లోని ఝారియన్ ప్రాంతంలో పాకిస్తాన్ నిఘా సంస్థలు అదుపులోకి తీసుకుని రహస్య ప్రదేశానికి తరలించాయి. మిలిటరీ క్యాంప్‌నకు లాడెన్ స్థావరం అతి సమీపంలో ఉంది. దీంతో లాడెన్ స్థావరం పాకిస్తాన్ ప్రభుత్వానికి తెలుసుననే ప్రచారం జరుగుతోంది. ఐదేళ్లుగా లాడెన్ ఆ భవనంలో ఉంటున్నాడని అమెరికా సిఐఎ డైరెక్టర్ లియోన్ పానెట్టా చెప్పారు.

English summary
Pakistani authorities on Wednesday arrested the contractor who built the three-storey mansion in Pakistan's northern city of Abbottabad where Osama bin Laden was residing, intelligence sources said.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X