వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తీహార్ జైలుకు సురేష్ కల్మాడీ, 14 రోజుల పాటు జ్యుడిషియల్ కస్టడీ

By Pratap
|
Google Oneindia TeluguNews

Suresh Kalamadi
న్యూఢిల్లీ: కామన్వెల్త్ క్రీడల నిర్వహణలో అవినీతి ఆరోపణలపై అరెస్టయిన సురేష్ కల్మాడీకి సీబీఐ ప్రత్యేక కోర్టు బుధవారం మరో 14 రోజుల జ్యూడీషియల్ కస్టడీ విధించింది. దీంతో ఆయనను పోలీసులు తీహార్ జైలుకు తరలించారు. కామన్వెల్త్ క్రీడల నిర్వహణ కమిటీ మాజీ అధ్యక్షుడు, కాంగ్రెస్ ఎంపీ అయిన సూరేష్ కల్మాడీ ఎనిమిది రోజుల రిమాండ్ బుధవారం పూర్తికావడంతో సీబీఐ అధికారులు కోర్టులో హాజరు పర్చగా ఈ మేరకు కస్టడీ విధించింది.

కాగా గత మంగళవారం (ఏప్రిల్ 26వ తేదీ) సురేష్ కల్మాడీని సీబీఐ అధికారులు పాటియాల కోర్టుకు తీసుకువెళుతుండగా కోర్టు ఆవరణవద్ద మహారాష్ట్రకు చెందిన ఓ వ్యక్తి కల్మాడీపైకి చెప్పులు విసిరిన నేపథ్యంలో ఈసారి అలాంటి సంఘటనలు జరగకుండా కోర్టు ఆవరణలో గట్టి భద్రతను ఏర్పాటు చేశారు.కామన్‌వెల్త్ క్రీడల నిర్వాహక కమిటీ మాజీ ఛైర్మన్ సురేష్ కల్మాడీపై అవినీతి, మోసంపై కేసులు నమోదు, టైమింగ్ స్కోర్ రిజల్ట్ సిస్టమ్ కోసం స్విస్ కంపెనీకి కల్మాడీ అక్రమంగా కాంట్రాక్టులు కట్టబెట్టారని, దీని వల్ల ప్రభుత్వ ఖజానాకు 95 కోట్ల రూపాయల నష్టం వాటిల్లిందని ఆరోపణలు ఉన్న నేపథ్యంలో కల్మాడీని సీబీఐ అధికారులు సోమవారం (ఏప్రిల్ 25) అరెస్ట్ చేసిన విషయం విదితమే.

English summary
A Delhi court has sent sacked Commonwealth Games Organizing Committee chairman Suresh Kalmadi and two others to judicial custody till May 18.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X