వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

లాడెన్ పాకిస్తాన్‌లోనే ఉన్నాడని ఇండియా రెండు సార్లు చెప్పింది

By Pratap
|
Google Oneindia TeluguNews

Osama Bin Laden
న్యూఢిల్లీ: ఆల్ ఖైదా చీఫ్ ఒసామా బిన్ లాడెన్ పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాద్‌కు సమీపంలోనే ఉన్నాడని భారత్ రెండు సార్లు చెప్పింది. భారత నిఘా వర్గాలు లాడెన్ స్థావరం గురించి చెప్పాయి. లాడెన్ కంటోన్మెంట్ ఏరియాలో ఉండవచ్చునని భారత నిఘా వర్గాలు 2007 మధ్యలో, 2008 ప్రారంభంలో చెప్పాయి. అయితే, భారత నిఘా వర్గాల సమాచారాన్ని అమెరికా తీవ్రంగా పరిగణించకపోయి ఉండవచ్చు లేదా తమకు అందిన సమాచారం మేరకే పని చేస్తూ ఉండవచ్చు.

పెషావర్‌లో 2007 మధ్యలో తాలిబాన్ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ఆల్ ఖైదా నెంబర్ టూ జవహరి హాజరయ్యాడు. ఈ సమయంలో లాడెన్ ఆచూకీ గురించి భారత భద్రతా సంస్థలు అమెరికాకు సమాచారం అందించింది. ఆ తర్వాత 2008 ప్రారంభంలో జవహరి ఇస్లామాబాద్‌ను సందర్శించాడు. ఏదో తక్షణం పని మీదనే అతను ఉంటాడని పసిగట్టి, లాడెన్ ఏ గుహల్లోనో లేడని, ఇస్లామాబాద్‌కు సమీపంలో ఉండి ఉంటాడని భారత నిఘా వర్గాలు సమాచారం అందించాయి. లాడెన్ అనారోగ్యంతో బాధపడుతున్నాడని, అతను కంటోన్మెంట్ ఏరియాలో ఉన్నాడని కూడా భారత్ తెలిపింది.

English summary
It now turns out that Indian agencies had twice warned their US counterparts about the presence of al-Qaida chief Osama bin Laden in an urbanized and heavily populated area not very far from Islamabad – once in mid-2007 and again in early 2008 when they specifically mentioned his likely presence in a cantonment area.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X