వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నిరాయుధుడు ఒసామా బిన్ లాడెన్‌పై అమెరికా సీల్స్ దాడి

By Pratap
|
Google Oneindia TeluguNews

Osama Bin Laden
వాషింగ్టన్: అమెరికా నేవీ సీల్స్ గదిలోకి దిగినప్పుడు ఆల్ ఖైదా వ్యవస్థాపకుడు ఒసామా బిన్ లాడెన్ చేతిలో ఆయుధం లేదు. నిరాయుధుడైన లాడెన్‌ను నేవీ సీల్స్ సులభంగా హతమార్చాయని అంటున్నారు. దీన్ని బట్టి లాడెన్‌ను చంపేయాలనే తప్ప ప్రాణాలతో పట్టుకోవాలనే ఉద్దేశం అమెరికాకు లేదని తెలుస్తోంది. లాడెన్ మృతదేహం ఛాయాచిత్రాలను విడుదల చేయాలా, వద్దా అనే విషయంపై అమెరికా ఇంకా మల్లగుల్లాలు పడుతోంది. ఆ ఛాయాచిత్రాలను విడుదల చేస్తే అమెరికా వ్యతిరేక మనోభావాలు పెచ్చరిల్లుతాయా అనే ఆందోళన చెందుతోంది.

లాడెన్ భయపెట్టే కదలికలను ప్రదర్శించాడని, తమ సీల్స్‌కు ముప్పు తలపెట్టే ప్రమాదం కనిపించిందని, దాంతో తమవాళ్లు లాడెన్‌ను కాల్చి చంపారని పెనెట్టా ఎన్‌బిసి నైట్లీ న్యూస్ ఇంటర్వ్యూలో చెప్పారు. ఈ స్థితిలో లాడెన్ మరణాన్ని ప్రపంచానికి ఎలా చూపించాలనే సందేహంలో అమెరికా పడినట్లు అర్థమవుతోంది. లాడెన్ మృతిని ప్రకటిస్తూ న్యాయం జరిగిందని అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా చెప్పారు. ఇస్లాం మత సంప్రదాయాల ప్రకారం లాడెన్ మృతదేహాన్ని సముద్రంలో కలిపేశామని శ్వేతసౌధం అధికార వర్గాలు చెప్పాయి.

English summary
Osama bin Laden was unarmed when Navy SEALs burst into his room and shot him to death, the White House said Tuesday, a change in the official account that raised questions about whether the U.S. ever planned to capture the terrorist leader alive.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X