కడప వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

వైయస్ జగన్ వ్యాఖ్యలను కొట్టి పారేసిన కేంద్రమంత్రి పురందేశ్వరి

By Srinivas
|
Google Oneindia TeluguNews

Purandeswari
కడప: మాజీ పార్లమెంటు సభ్యుడు, వైయస్ఆర్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి ఏఐసిసి అధ్యక్షురాలు సోనియాగాంధీపై చేసిన వ్యాఖ్యలు అర్థరహితమని కేంద్రమంత్రి పురందేశ్వరి బుధవారం పులివెందులలో విలేకరులతో మాట్లాడుతూ చెప్పారు. సోనియా అహంకారానికి, కడప ఆత్మగౌరవానికే ఉప ఎన్నికలు అన్న జగన్ వ్యాఖ్యలు సరికావని ఆమె చెప్పారు. మాజీ మంత్రి వైయస్ వివేకానందరెడ్డి తన తరఫున ప్రచారానికి రమ్మని చెప్పినందు వల్లే తాను పులివెందులకు వచ్చానని చెప్పారు.

వివేకాకు మద్దతు తెలిపేందుకే తాను వచ్చానని అన్నారు. ఉప ఎన్నికలలో వైయస్ వివేకానందరెడ్డి గెలుపుతోనే పులివెందులలో అభివృద్ధి సాధ్యమవుతుందని చెప్పారు. ఉప పోరులో కాంగ్రెసు గెలుపు ఖాయమని చెప్పారు. దశాబ్దాలుగా ప్రజలు కాంగ్రెసును అదరిస్తున్నట్టే ఇప్పుడు కూడా ఆదరిస్తారని చెప్పారు.

English summary
Central Minister Purandeswari condemned Ex MP YS Jaganmohan Reddy today in Pulivendula. She said YS Vivekananda Reddy was invited her to campaign. She suggested voters that Pulivendula will developed with Viveka's win.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X