హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఆంధ్రప్రదేశ్ సిఎం వైయస్సార్ లాగే అరుణాచల్ సిఎం ఖండు మృతి

By Pratap
|
Google Oneindia TeluguNews

Dorjee Khandu-YS Rajasekhar Reddy
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి మృతి తర్వాత కూడా ప్రభుత్వ వర్గాలు గుణపాఠాలు నేర్చుకున్నట్లు లేదు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి ప్రయాణిస్తున్న హెలికాప్టర్ అదృశ్యమైనట్లుగా అరుణాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి దోర్జీ ఖండు హెలికాప్టర్ కూడా మాయమైంది. అంతేకాకుండా వైయస్ రాజశేఖర రెడ్డి మాదిరిగా హెలికాప్టర్ ప్రమాదంలో దోర్జీ మరణించారు. హెలికాప్టర్ శకలాలు చెల్లాచెదురై మృతదేహాలు సంఘటన స్థలంలో పడిపోయాయి. నల్లమల అడవుల్లో వైయస్సార్, ఇతర అధికారుల మృతదేహాల మాదిరిగానే అరుణాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి దోర్జీ, ఆయన అధికారుల మృతదేహాలు పడిపోయాయి.

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి ప్రయాణించిన హెలికాప్టర్ నుంచి బయలుదేరిన గంట లోపే సంకేతాలు అందడం ఆగిపోయింది. 2009 సెప్టెంబర్ 2వ తేదీన ఈ సంఘటన చోటు చేసుకుంది. ఆ తర్వాత 24 గంటలకు విషాద వార్త తెలిసింది. హెలికాప్టర్ దట్టమైన నల్లమల అడవుల్లో కూలిపోయి వైయస్ రాజశేఖర రెడ్డి మరణించారు. వైయస్ రాజశేఖర రెడ్డి హెలికాప్టర్ ప్రమాదం నుంచి కూడా ఏ విధమైన పాఠాలు నేర్చుకోలేదని ఖండు సంఘటన తెలియజేస్తోంది.

English summary
The disappearance of the chopper on which Arunachal Pradesh chief minister Dorjee Khandu took off from Tawang on Saturday morning has brought back memories of another search, for another Chief Minister. On September 2, 2009, Andhra Pradesh Chief Minister YSR Reddy's chopper went off the radar of the Air Traffic Control within less than an hour of take-off. In that case, it was tragic news that came at the end of 24 hours.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X