వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

లాడెన్‌ను పట్టుకుని చంపారా, అవునంటున్న టీవీ కథనం

By Pratap
|
Google Oneindia TeluguNews

Osama Bin Laden
ఇస్లామాబాద్: ఆల్ ఖైదా వ్యవస్థాపకుడు ఒసామా బిన్ లాడెన్‌ను పట్టుకుని కాల్చి చంపారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నిరాయుధుడైన లాడెన్‌ను పట్టుకుని కాల్చి చంపారని అతని 12 ఏళ్ల కూతురు అంటోందని ఓ టీవీ చానెల్ వ్యాఖ్యానించింది. శ్వేతసౌధం మాటలు మారుస్తుండడంతో లాడెన్ కచ్చితంగా ఎలా చనిపోయాడనేది అయోమయంగానే ఉంది. తన తండ్రిని పట్టుకుని, ఆ తర్వాత కాల్చి చంపారని లాడెన్ కూతురు చెప్పినట్లు ఓ అరబిక్ టీవీ చానెల్ కథనం.

ఆ టీవీ చానెల్ కథనం ప్రకారం - ఆ 12 బాలిక లాడెన్ యెమెనీ భార్యతో పాటు కస్టడిలో ఉందని పాకిస్తాన్ ఇంటర్ సర్వీసెస్ ఇంటలిజెన్స్ (ఐఎస్ఐ) చెప్పింది. లాడెన్ హత్య సమయంలో జీవించి ఉన్న 12 మంది మహిళలు, పిల్లలు ఐఎస్ఐ కస్టడీలో ఉన్నారు. లాడెన్ మరణించాడని, అతన్ని పట్టుకుని చంపారని వారిలో ఉన్న 12 బాలిక చెబుతోంది. లాడెన్‌ను అరెస్టు చేసి తీసికెళ్లి మరో చోట కాల్చి చంపారని ఆ బాలిక చెప్పిందని పాకిస్తాన్ అధికారులు చెబుతున్నారు.

English summary
Osama bin Laden was unarmed at the time of his killing and his 12-year-old daughter saw her father being shot dead, it was revealed on Wednesday, even as the exact circumstances of the al-Qaida chief's death remained unclear and the White House changed versions.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X