వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మంత్రులకు, ఎమ్మెల్యేలకు ఎన్నికల సంఘం ప్రధానాధికారి హుకుం

By Pratap
|
Google Oneindia TeluguNews

Bhanwarlal
హైదరాబాద్‌ : కడప లోకసభ, పులివెందుల శాసనసభ స్థానాలకు జరుగుతున్న ఉప ఎన్నికల ప్రచారం ముగిసిన తర్వాత మంత్రులు, శాసనసభ్యులు కడప లోకసభ నియోజకవర్గం పరిధిలో ఉండరాదని ఎన్నికల సంఘం రాష్ట్ర ప్రధానాధికారి భన్వర్‌లాల్ ఆదేశించారు. స్థానికులు కానివారెవరూ ఆ నియోజకవర్గాల్లో ఉండరాదని ఆయన ఆదేశాలు జారీ చేశారు. ప్రభుత్వోద్యోగులు ఎన్నికల ప్రచారంలో పాల్గొంటే కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన గురువారం మీడియా ప్రతినిధుల సమావేశంలో చెప్పారు. ఉప ఎన్నికలపై ప్రజాభిప్రాయ సేకరణను, ఎగ్జిట్ పోల్ సర్వేలను, ప్రసారాలను నిషేధించినట్లు ఆయన తెలిపారు.

ఉప ఎన్నికల్లో 10,829 మందిని బైండోవర్ చేసినట్లు ఆయన తెలిపారు. మొత్తం 2.72 కోట్ల రూపాయలను స్వాధీనం చేసుకున్నామని ఆయన చెప్పారు. 316 వాహనాలను స్వాధీనం చేసుకున్నట్లు ఆయన తెలిపారు. 16 అనధికార ఆయుధాలను కూడా స్వాధీనం చేసుకున్నట్లు ఆయన తెలిపారు. 204 అత్యంత సున్నితమైన ప్రాంతాలను, 584 సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించినట్లు ఆయన తెలిపారు. ఉప ఎన్నికలు సజావుగా జరిగేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు ఆయన తెలిపారు. ఉప ఎన్నికల ప్రచారం రేపు శుక్రవారం 5 గంటల 30 నిమిషాలకు ముగుస్తుందని ఆయన చెప్పారు.

English summary
State Chied Electoral officer Bhanwarlal ordered ministers and MLAs to stay away from Kadapa, after the campaign is ended.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X