చెన్నై వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

రజనీకాంత్‌కు మళ్లీ అస్వస్థత, మూడు రోజుల విశ్రాంతికి సలహా

By Pratap
|
Google Oneindia TeluguNews

Rajinikanth
చెన్నై: తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ మళ్లీ అస్వస్థతకు గురయ్యారు. ఛాతీ నొప్పితో బాధపడుతున్న రజనీకాంత్‌ను సెయింట్ ఇసాబెల్ ఆస్పత్రిలో చేర్చారు. ఆయన వైరల్ ఇన్‌ఫెక్షన్, బ్రాంకైటిస్‌లతో బాధపడుతున్నట్లు వైద్యులు చెప్పారు. మూడు రోజులు విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు ఆయనకు సలహా ఇచ్చారు. రాణా షూటింగ్ ప్రారంభోత్సవం జరిగిన గత శుక్రవారం కూడా ఆయన అస్వస్థతకు గురయ్యారు. దీంతో అప్పుడు ఇదే ఆస్పత్రిలో చేరారు. అదే రోజు సాయంత్రం ఆయనను ఆస్పత్రి నుంచి డిశ్చార్జీ చేశారు.

అయితే, అప్పటి నుంచి రజనీకాంత్‌కు విశ్రాంతి లేకుండా పోయింది. అది ఆయన ఆరోగ్యంపై ప్రభావం చూపిందని వైద్యులు అంటున్నారు. కెఎస్ రవికుమార్ దర్శకత్వం వహిస్తున్న రాణా చిత్రంలో ఆయన త్రిపాత్రాభినయం చేస్తున్నారు. ఈ సినిమాను తెలుగు, హిందీ, తమిళ భాషల్లో వచ్చే ఏడాది విడుదల చేయాలని అనుకుంటున్నారు. ఈ సినిమాలో రజనీకాంత్ సరసన బాలీవుడ్ నటి దీపికా పడుకొనే నటిస్తోంది.

English summary
Actor Rajinikanth has been taken to St Isabel Hospital in Chennai with severe chest congestion and uneasiness. Doctors said he was suffering from viral infection and bronchitis. He has been advised three days rest.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X