వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

హైటెక్ విఫలం, ఖండూ భౌతిక దేహాన్ని గ్రామస్థులు కనిపెట్టారు

By Pratap
|
Google Oneindia TeluguNews

Dorjee Khandu
ఇటానగర్: హైటెక్ విఫలమైన చోట గ్రామస్థులు విజయం సాధించారు. అరుణాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి భౌతిక కాయాన్ని గ్రామస్థులు కనిపెట్టగలిగారు. ఖండూతో పాటు మరో నలుగురి మృతదేహాలు తవంగ్ జిల్లాలోని మారుమూల గ్రామంలో బయటపడ్డాయి. ఆర్మీ, ఐఎఎఫ్, ఎస్ఎస్‌బి, ఐటిబిపి సహాయక బృందాలు ఖండూ ప్రయాణించిన హెలికాప్టర్ కోసం విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టాయి. ఇస్రో శాటిలైట్ చిత్రాలు, సుఖోయ్ ఎయిర్‌క్రాఫ్ట్ మ్యాపింగ్ కూడా హెలికాప్టర్ కూలిపోయిన స్థలాన్ని గుర్తించలేకపోయాయి. కాలినడకన బయలుదేరిన గ్రామ ప్రజలు ఆ స్థలాన్ని పట్టుకున్నారు.

తుప్టెం అనే గ్రామ సంరక్షక దళం సభ్యుడు ఖండూ భౌతిక కాయాన్ని గుర్తించాడు. మూడు మృతదేహాలు గుర్తించలేని స్థితిలో ఉన్నాయి. కేయ్లా గ్రామానికి చెదిన తుప్టెం, అతని అనుచరులు సముద్ర మట్టానికి 14 వేల అడుగుల ఎత్తులో పడి ఉన్న హెలికాప్టర్ శకలాలను గుర్తించారు. సంఘటనా స్థలాన్ని వారు ఎలా గుర్తించారనేది ఇంకా తెలియాల్సి ఉంది. ఖండూ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ శనివారంనాడు కనిపించకుండా పోయింది. ఆయనతో పాటు మరో నలుగురు హెలికాప్టర్‌లో ఉన్నారు. వారంతా ప్రమాదంలో మరణించారు.

English summary
The bodies of Arunachal Pradesh chief minister Dorjee Khandu and four others were spotted in an inaccessible village in Tawang district on Wednesday, five days after the helicopter flying them to Itanagar went missing.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X