హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

జగన్ ఎవ్వరి మాట వినడు, మరికొందరు నా బాటలోనే: కాటసాని

By Srinivas
|
Google Oneindia TeluguNews

YS Jagan
హైదరాబాద్: మాజీ పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి ఒంటెత్తు పోకడలకు వెళ్తూ, ఎవరికీ ప్రాధాన్యత ఇవ్వడం లేదని అందుకే తాను తిరిగి చిరంజీవితో కలిసి పని చేయడానికి వచ్చానని ప్రజారాజ్యం పార్టీ బనగానపల్లి ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి శుక్రవారం విలేకరులతో మాట్లాడుతూ చెప్పారు. తనకు జగన్ పార్టీలో తగిన ప్రాధాన్యత లేని లేదని చెప్పారు. జగన్ వద్ద అంతర్గత స్వేచ్ఛ లేదన్నారు. ఆయన ఎమ్మెల్యేలను ఎమ్మెల్యేలుగా కూడా గుర్తించడం లేదన్నారు. జగన్ ఒంటెద్దు పోకడల కారణంగా తనతో పాటు మరికొందరు వెనక్కి రావడానికి సిద్ధంగా ఉన్నారన్నారు.

ఇటీవల పులివెందులలో చిరంజీవి ప్రచారం చేస్తున్న సమయంలో జగన్ వర్గం కోడిగుడ్లు విసరడం బాధ కలిగించిందన్నారు. ప్రతి ఒక్కరికి ప్రచారం చేసుకునే హక్కు ఉందని కానీ అలా గుడ్లు విసరడం అన్యాయమని చెప్పారు. ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరికి ఓట్లు అడిగే హక్కు ఉందన్నారు. ఒక లౌకిక వాదిగా బిజెపితో కలుస్తానని జగన్ చెప్పడం తనను కలిచి వేసిందన్నారు. జగన్ బిజెపితో కుమ్మక్కయ్యారన్నారు. మొదటి నుండి కాంగ్రెసులో ఉన్న తమకు ఆ వ్యాఖ్యలు నచ్చలేదన్నారు. తనకు డిప్యూటీ స్పీకర్ నాదెండ్ల మనోహర్ నోటీసులు పంపించారని తెలిసిందని, అయితే తనకు అవి అందలేదని చెప్పారు. తాను తాఖీదులకు భయపడి వెనక్కి తిరిగి రాలేదన్నారు. కేవలం జగన్ పోకడ నచ్చకనే వెనక్కి వచ్చానని చెప్పారు. జగన్ ఇప్పటి వరకు పార్టీ విధివిధానాలపై సమావేశం నిర్వహించిన దాఖలాలు లేవు.

జగన్‌కు ప్రజాస్వామ్యంపై నమ్మకం లేదని ఆరోపించారు. జగన్ ఒంటెత్తు పోకడలలో మార్పు రావాలని కోరుకుంటున్నట్టు చెప్పారు. ఆయన తీరుపై ఎమ్మెల్యేలకు, కార్యకర్తలకు అందరికీ అసంతృప్తి ఉందన్నారు. పోసాని మురళీ కృష్ణను వెంట బెట్టుకొని చిరంజీవిపై విమర్శలు చేయించవలసిన అవసరం లేదన్నారు. పోసాని తదితరుల వెనుక ఎవరు ఉన్నారో ప్రజలందరికీ తెలుసున్నారు. తాను ఇన్నాళ్లూ జగన్‌తో ఉన్నప్పటికీ చిరంజీవిని ఎక్కడా విమర్శించలేదన్నారు. చిరంజీవిపై విశ్వాసంతోనే తాను తిరిగి వచ్చినట్లు చెప్పారు.

English summary
PRP MLA Katasani Rami Reddy accused that Ex MP YS Jaganmohan Reddy attitude. He said they has no freedom in Jagan's party.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X