అనంతపురం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

సత్యసాయి ట్రస్టు చెక్ పవర్ ముగ్గురికి, ఇధ్దరు సంతకాలు చేస్తే ఓకే

By Srinivas
|
Google Oneindia TeluguNews

Sathya Sai Baba
అనంతపురం: భగవాన్ శ్రీ సత్యసాయిబాబా ట్రస్టు కార్యకలాపాల నిర్వహణ కోసం చెక్ పవర్‌ను ముగ్గురికి కట్టబెడుతూ ట్రస్టు బోర్డు గురువారం నిర్ణయం తీసుకుంది. సత్యసాయి సోదరుడి తనయుడు రత్నాకర్, వి.శ్రీనివాసన్, ఎస్ వి గిరిలకు చెక్ పవర్ కట్ట బెట్టారు. అయితే ఇందులో ఏ ఇద్దరు సంతకాలు చేసినా చెల్లుబాటు అవుతుంది. ఇక ట్రస్టు శాశ్వత చైర్మన్‌గా సత్యసాయిబాబానే కొనసాగుతారని చెప్పారు. ట్రస్టు గురువారం జస్టిస్ భగవతి అధ్యక్షతన సమావేశం అయింది. రత్నాకర్ పేరిట ప్రెస్ నోట్ విడుదల అయింది. అయితే సత్యసాయి బాబా దేహం వీడిన తర్వాత ట్రస్ట్ నిర్వహణను ఎవరు చేపడతారన్న విషయమై సందేహాలు వెల్లువెత్తిన సంగతి తెలిసిందే.

అయితే సత్యసాయి దశదిన కర్మ పూర్తయిన తర్వాతే ట్రస్ట్ సమావేశం నిర్వహించి వీటిపై నిర్ణయం తీసుకుంటామని అప్పట్లో సభ్యులు ప్రకటించారు. ఈ నేపథ్యంలో, సాయి కుల్వంత్ హాల్‌లో బుధవారం జరిగిన సత్యసాయి ఆరాధనోత్సవాల్లో ట్రస్టు సభ్యుడు శ్రీనివాసన్ మాట్లాడుతూ ట్రస్ట్ వ్యవస్థాపకులైన సత్యసాయే దానికి శాశ్వత చైర్మన్‌గా కొనసాగుతారని ప్రకటించారు. జస్టిస్ పీఎన్ భగవతి అధ్యక్షతన ట్రస్ట్ సభ్యులు ఇందూలాల్ షా, ఆర్‌జే రత్నాకర్, వి.శ్రీనివాసన్, ఎస్‌వి గిరి గురువారం ప్రశాంతి నిలయంలో సమావేశమయ్యారు. ఏకగ్రీవంగా పలు తీర్మానాలు చేశారు.

ట్రస్ట్ వ్యవహారాలను నడిపేందుకు జస్టిస్ భగవతి అధ్యక్షతన సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించారు. సత్యసాయి చేపట్టిన ఉచిత విద్య, వైద్యం, తాగునీరు, ఇతర మౌలిక సదుపాయాల కల్పన, నిర్వహణలో ఎలాంటి లోటుపాట్లు జరగకుండా పారదర్శకంగా వ్యవహరించేందుకే ముగ్గురికి చెక్ పవర్ ఇవ్వాలంటూ ట్రస్ట్ సభ్యులు నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.

English summary
Sri Sathya Sai Trust board give cheque power to three members. Srinivasan, SV Giri and Ratnakar were have cheque power.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X