వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

త్వరలో లాడెన్ చివరిగా మాట్లాడిన ఆడియో టేప్ విడుదల: ఆల్-ఖైదా

|
Google Oneindia TeluguNews

Osama Bin Laden
అమెరికా నేవీ సీల్స్ చేతిలో హతమైన ఆ దేశపు ప్రధాన శత్రువు, ఆల్-ఖైదా అధినేత ఒసామా బిన్ లాడెన్ చివరి మాటలు త్వరలోనే బయటకు రానున్నాయి. పాకిస్థాన్‌లోని అబ్బోతాబాద్‌ నగరంలో లాడెన్‌ను అమెరికా బలగాలు చంపడానికి ఓ వారం ముందే రికార్డ్ చేసిన ఓ ఆడియో టేపు తమ వద్ద ఉన్నదని, త్వరలోనే దానిని బయటకు విడుదల చేస్తామని తీవ్రవాద సంస్థ ఆల్-ఖైదా ప్రకటించినట్లు యూఎస్ మోనిటరింగ్ గ్రూప్ సైట్ (SITE) పేర్కొంది.

నాలుగు పేజీల నిడివి గల ఆ ప్రకటనలో ఒసామా బిన్ లాడెన్ మృతి చెందినట్లు ఆల్-ఖైదా ప్రకటించింది. అంతేకాకుండా లాడెన్‌ను చంపినందుకు ప్రతీకారంగా అమెరికా, యూరప్ దేశాలపై మరిన్ని దాడులకు పాల్పడుతామని హెచ్చరించింది. ఇంకా బిన్ లాడెన్ మరణం ఓ శాపమని, అది అమెరికన్లు మరియు వారి ఏజెంట్లను వెంటాడుతుందని, అమెరికన్ల సంతోషం త్వరలోనే విషాదంగా మారుతుంది. వారి రక్తం, కన్నీళ్లలో కలుస్తుంది" అని అల్ కాయిదా తన ప్రకటనలో పేర్కొంది.

అమెరికాపై దాడికి పాక్‌లోని ముస్లింలు సహకరించాలని, లాడెన్ అసువులుబాసిన పాక్ నేలలోని ముస్లింలు తిరగబడాలని, అమెరికన్ల వల్ల అవినీతిమయమైన పాక్‌ను పరిశుద్ధం చేసుకోవడానికి ముందుకు రావాలంటూ ఆల్-ఖైదా పేర్కొంది. ఈ వివరాలను ఇస్లామిక్ తీవ్రవాదుల వెబ్‌సైట్లపై నిఘా పెడుతున్న అమెరికా పర్యవేక్షణ సంస్థ 'సైట్" ఈ ప్రకటించింది.

English summary
Al-Qaeda has promised to "soon" release its slain chief Osama bin Laden's final audio message, which was recorded a week before his killing by the US special forces in Pakistan's garrison city of Abbottabad. In a four-page statement, the terror group said bin Laden recorded the audio message a week before his death which will be released "soon", according to the US monitoring group SITE.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X