కడప వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

వైయస్ జగన్ విజయావకాశం ఎంత: పులివెందుల వివేకాదేనా!

By Srinivas
|
Google Oneindia TeluguNews

YS Jagan
కడప: మాజీ పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డికి ప్రతిష్టాత్మకంగా నిలిచిన పులివెందుల, కడప ఉప ఎన్నికలు పూర్తయ్యాయి. కడప పార్లమెంటు నుండి జగన్ విజయావకాశాలపై ఎవరికీ అనుమానం లేకున్నప్పటికీ ఎంత ఆధిక్యం అనే దానిపైనే జగన్ పరువు ఆధార పడి ఉంది. గత సాధారణ ఎన్నికలలో జగన్ లక్షా డెబ్బై వేల ఓట్లతో గెలిచాడు. అయితే ఈసారి అంతకంటే ఎక్కువ రావాలని వైయస్ఆర్ కాంగ్రెసు పార్టీ శాయశక్తులా ప్రయత్నాలు చేసింది. అదేవిధంగా జగన్ ఆధిక్యాన్ని లక్షకన్నా తగ్గించాలని కాంగ్రెసు, టిడిపిలు ప్రయత్నాలు చేశాయి.

జగన్ విజయం దాదాపుగా ఖాయమైనప్పటికీ ఆధిక్యత మాత్రం భారీగా ఉంటేనే ఆయన ప్రభావం ఉన్నట్టుగా అందరూ గుర్తించేలా కనిపిస్తోంది. లేదంటే వచ్చే ఎన్నికల నాటికి జగన్ పార్టీలో జగన్ తప్ప మరే సీటు గెలిచే అవకాశమే లేదని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. ఎందుకంటే వైయస్ దుర్మరణం, కాంగ్రెసు నుండి బయటకు రావడం, గత ముప్పయ్యేళ్లుగా కడపలో వారి కుటుంబమే రాజ్యమేలుతున్న నేపథ్యంలో ఎన్నికలు జరుగుతున్న దృష్ట్యా జగన్ ఇది వరకు గెలిచినట్లుగా సాధారణంగా గెలిస్తే ఆయన ప్రభావం శూన్యమే అంటున్నారు.

ఇక పులివెందుల నియోజవర్గంలో కూడా విజయమ్మ గెలుపు జగన్‌కు అత్యంత ప్రతిష్టాత్మకం. ఎంపీగా గెలుస్తాడనే వాదనలు వినిపించినప్పటికీ పులివెందులలో మాత్రం విజయమ్మ గెలిచే అవకాశాలు ఎంతగా ఉన్నాయో, ఓడిపోయే అవకాశాలు అంతే ఉన్నాయని అంటున్నారు. ఒకవేళ జగన్‌కు అత్యంత ముఖ్యమైన పులివెందులలో విజయమ్మ ఓడిపోయినా జగన్ పని డమాల్ అంటున్నారు పరిశీలకులు. ఎందుకంటే పులివెందులలో జగన్ బాబాయి, కాంగ్రెసు అభ్యర్థి వివేకానందరెడ్డికి పట్టు ఉండటమే అందుకు కారణం. ఎన్నికల సంఘం ఉప ఎన్నికల తేదిని ప్రకటించిన సమయంలో జగన్ దూసుకు పోయిన మాట నిజమే.

ఎందుకంటే జగన్ రాజీనామా చేసినప్పుడే ఆయన పోటీ చేస్తారనేది అందరికీ తెలిసిందే. కాబట్టి అక్కడ ఎవరు పోటీ చేస్తారనే దానిపై చర్చలు లేవు. అయితే కాంగ్రెసు, టిడిపి అందుకు విరుద్దం. దాంతో వారు అభ్యర్థుల ప్రకటనకు సమయం తీసుకున్నారు. అయితే ఆ సమయంలో జగన్ దూసుకు పోయారు. ఎన్నికలకు వారం రోజుల క్రితం వరకు కూడా జగన్‌పై భారీగానే అంచనాలు ఉండేవి. అయితే ఆ తర్వాత జగన్‌కు ధీటుగా డిఎల్ రవీంద్రారెడ్డి, వైయస్ వివేకానందరెడ్డి కూడా ప్రచారం చేయడంతో విజయం ఏకపక్షం కాకుండా పోయింది.

వారి ధాటి తట్టుకొని గెలవాలంటే బాగానే కష్టపడాలని జగన్‌కు ఆఖర్లో అర్థమైంది. జగన్ గెలిచినప్పటికీ డిఎల్ గట్టి పోటీ ఇవ్వక తప్పదు. ఇక వివేకానందరెడ్డి విజయమ్మ విజయాన్ని అడ్డుకున్నా ఆశ్చర్య పోవాల్సిన అవసరం లేదు. పోలింగ్ సరళి చూసినా అది స్పష్టమవుతుంది. ఓటింగ్ శాతం గతంలో కంటే కొద్దిగా పెరిగినప్పటికీ ఓటర్లు ముప్పయ్యేళ్ల తర్వాత స్వేచ్ఛగా ఓటు వేశారనే భావన అందరిలో ఉంది. ఈ స్వేచ్ఛ ఖచ్చితంగా జగన్ మెజార్టీని తగ్గిస్తుందని భావిస్తున్నారు. అంతేకాదు ప్రచారం ముగిసాక డబ్బుల పంపకం జరిగే సమయంలో ఓటర్లు వైయస్ఆర్ కాంగ్రెసు నేతలను అక్రమాలు చేసి అన్ని డబ్బులు సంపాదించారు. మాకు వెయ్యి రూపాయలు ఇస్తే తప్పేంటి అని ప్రశ్నించినట్టు కూడా వార్తలు వచ్చాయి. అంటే జగన్ అక్రమాలకు పాల్పడ్డాడనే భావన కడప ఓటర్లలో బలంగా నాటుకు పోయిందనేది సుస్పష్టం.

పోలింగ్ కేంద్రాలలో ఉదయం ఎనిమిది గంటల నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు భారీగా ఓటర్లు వరుస కట్టారు. పన్నెండు గంటల వరకే రెండు నియోజకవర్గాలలోనూ దాదాపు 40 శాతం ఓటింగ్ పూర్తయింది. ఆ పరిస్థితి చూసి అన్ని పార్టీల అభ్యర్థులు ఆనందం వ్యక్తం చేశారు. గతంలో కంటే భారీగా ఓటింగ్ నమోదవుతుందని అందరూ భావించారు. అయితే మధ్యాహ్నం ఎండల కారణంగా పోలింగ్ కేంద్రాలు నిర్మానుష్యంగా మారిపోయాయి.
పోలింగ్ కేంద్రాలు స్తబ్ధగా కనిపించడంతో భారీ ఓటింగ్‌పై మధ్యాహ్నం తర్వాత ఆశలు వదిలేసుకున్నప్పటికీ ఆ తర్వాత మళ్లీ సాయంత్రం భారీగా పుంజుకుంది.

పులివెందులలో ఓటు వేయడానికి వచ్చిన ఓ వృద్ధుడు ఎండ దెబ్బకు మృతి చెందాడు. అక్కడక్కడా చెదురు ముదురు ఘటనలు మినహా హింసాత్మక సంఘటలు మరీ ఎక్కువ ఏమీ చోటు చేసుకోలేదు. కొన్ని ప్రాంతాలలో మొదట ఇవిఎంలు మొరాయించటంతో కొత్త వాటిని ఏర్పాటు చేశారు. జగన్ పార్టీ భారీగా అక్రమాలకు పాల్పడటంతో పాటు, ఓటర్లను బెదిరిస్తుందని టిడిపి, కాంగ్రెసు అభ్యర్థులు ఎన్నికల సంఘంలో ఫిర్యాదు చేయగా, కాంగ్రెసు, వైయస్ఆర్ కాంగ్రెసు అక్రమాలకు పాల్పడుతోందని టిడిపి ఇలా ఫిర్యాదుల వెల్లువ మాత్రం అధికారులకు చేరింది. కాంగ్రెసు, వైయస్ఆర్ పార్టీ మధ్య రాళ్ల వర్షం కూడా చోటు చేసుకుంది.

English summary
Ex MP YS Jaganmohan Reddy party will disappers in 2014 if Jagan loose Pulivendula constituency or losing his majority from Kadapa.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X