హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

మూడు డిమాండ్లు అంగీకరించిన ప్రభుత్వం: జుడా - ప్రభుత్వ చర్చలు సఫలం

By Srinivas
|
Google Oneindia TeluguNews

Hyderabad
హైదరాబాద్: ప్రభుత్వం ఆసుపత్రులలోని వైద్యులపై దాడులు జరక్కుండా నివారించడానికి ప్రత్యేక పోలీసు దళం ఏర్పాటు చేయాలనే ప్రధాన డిమాండుతో ఆందోళన బాటపట్టిన జుడాలు సమ్మె విరమించే అవకాశాలు కనిపిస్తున్నాయి. సోమవారం జుడాలు, ప్రభుత్వ అధికారుల మధ్య జరిగిన చర్చలు సఫలం అయ్యాయని తెలుస్తోంది. జూనియర్ డాక్టర్లు పెట్టిన ప్రధాన డిమాండుతో పాటు మరో రెండు డిమాండ్లకు కూడా ప్రభుత్వం అంగీకరించింది. ఎనిమిది మందితో కూడిన జుడా డాక్టర్లు ప్రభుత్వ అధికారులు పివి రమేష్ తదితరులతో జరిగిన చర్చలు సానుకూల వాతావరణం మధ్య జరిగాయి.

జుడాలు ప్రభుత్వం ముందుంచిన మూడు డిమాండ్లకు అంగీకరించింది. హైదరాబాద్‌తో పాటు వరంగల్ జిల్లాలోని ఆసుపత్రుల ముందు ఎస్పీఎఫ్ భద్రతా దళాలను నియమించేందుకు ప్రభుత్వం అంగీకరించింది. నీలోఫర్ ఆసుపత్రిలో మంగళవారం నుండే భద్రతా దళాలను నియమించనున్నారు. ఆ ప్రధాన డిమాండుతో పాటు ఆసుపత్రిలో భద్రత కోసం ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయడం, వైద్య సేవల అధ్యయనానికి మరో కమిటీని ఏర్పాటు చేయడం వంటి మరో రెండు డిమాండ్లకు కూడా ప్రభుత్వం అంగీకరించింది. ప్రభుత్వ అధికారి పివి రమేష్ కూడా జుడా డిమాండ్లకు అంగీకరించినట్లు చెప్పారు.

English summary
Government accepted JUDAs demand that to put SPF at hospitals for doctors protection. JUDAs put three demands before government.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X