హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

జగన్‌తో వెళ్లేది లేదు: కాటసాని, అనర్హతపై స్పీకర్‌తో చర్చించిన వంగా గీత

By Srinivas
|
Google Oneindia TeluguNews

YS Jagan
హైదరాబాద్: తాను ఎట్టి పరిస్థితుల్లోనూ మాజీ పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డితో వెళ్లేది లేదని ప్రజారాజ్యం పార్టీ శాసనసభ్యుడు కాటసాని రామిరెడ్డి సోమవారం స్పష్టం చేశారు. తాను ప్రజారాజ్యం పార్టీలోనే కొనసాగుతానని చెప్పారు. తాను ఎప్పుడు కూడా చిరంజీవికి వ్యతిరేకంగా మాట్లాడలేదని చెప్పారు. పార్టీని కూడా ధిక్కరించి వ్యాఖ్యలు చేయలేదన్నారు. డిప్యూటీ స్పీకర్ నాదెండ్ల మనోహర్ తనకు ఇచ్చిన నోటీసులపై మూడు రోజులలో సమాధానం చెబుతానని చెప్పారు. పార్టీ విలీనాన్ని వ్యతిరేకిస్తూ ఎన్నికల సంఘానికి ఇచ్చిన లేఖను వాపసు తీసుకుంటానని చెప్పారు. నోటీసులకు భయపడి తాను వెనక్కి రాలేదని చెప్పారు. తాను మొదటి నుండి కాంగ్రెసు వాదినని, జగన్ బిజెపిలో చేరడం తనకు రుచించలేదన్నారు.

కాగా ప్రజారాజ్యం పార్టీ విప్ వంగా గీత సోమవారం డిప్యూటీ స్పీకర్‌ను కలిశారు. కాటసాని రామిరెడ్డికు ఇచ్చిన తాఖీదులు, అనర్హత వేటు తదితర అంశాలపై చర్చించారు. కాగా కడప ఉప ఎన్నికల ఫలితాలు ఎలా వచ్చినా అహంకారానికి, ఆత్మగౌరవానికి మధ్య జరిగినవే అని వంగా గీత అన్నారు.

English summary
PRP MLA Katasani Rami Reddy confirmed that he will not go with Ex MP YS Jaganmohan Reddy. He said he will answered within three day to deputy speaker notices.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X