వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

లాడెన్ హెర్బల్ వయాగ్రా వాడేవాడు, డయాలసిస్ లేదు: భార్య సదా

By Pratap
|
Google Oneindia TeluguNews

Osama Bin Laden
ఇస్లామాబాద్: పాకిస్తాన్‌లోని స్థావరంలో ఉంటున్నప్పుడు ఆల్ ఖైదా నేత ఒసామా బిన్ లాడెన్‌కు మూత్రపిండాల డయాలసిస్ అవసరం రాలేదని, అయితే హెర్బల్ వయాగ్రా మాత్రం వాడేవాడని అతని భార్య చెప్పింది. లాడెన్ హెర్బల్ ఇంపోటెన్స్ డ్రగ్ వాడేవాడని అమెరికా నేవీ సీల్స్ కాల్పుల్లో గాయపడిన లాడెన్ యెమెన్ భార్య అమల్ ఆల్ సదా చెప్పింది. లాడెన్ సొంత వైద్యం చేసుకునేవాడని ఆమె చెప్పింది. అమెరికా నేవీ సీల్స్ తమ పడక గదిలోకి ప్రేవశించి లాడెన్‌ను చంపారని ఆమె చెప్పింది.

లాడెన్‌ రెండు మూత్రపిండాలకు శస్త్రచికిత్స జరిగిందని, దాని నుంచి ఆయన కోలుకున్నారని ఆమె చెప్పింది. స్థావరంలో లభించిన మందుల ప్రకారం లాడెన్ అంత బలహీనంగా లేడని వెల్లడైంది. లాడెన్ బలహీనంగా లేడని 29 ఏళ్ల సదా స్పష్టం చేసింది. కాగా, అమెరికా లాడెన్ ముగ్గురు భార్యలను విచారించేందుకు అవకాశం కల్పించాలని పాకిస్తాన్‌ను డిమాండ్ చేస్తోంది.

పాకిస్తాన్‌లోని అబ్బొత్తాబాద్‌లో పాకిస్తాన్‌కు లాడెన్ ముగ్గురు భార్యలతో సహా దొరికిన వారిందరినీ తాము విచారించడానికి అవకాశం కల్పించాలని, స్థావరంలో లభించిన వస్తువులను తమకు అప్పగించాలని అమెరికా పాకిస్తాన్‌ను డిమాండ్ చేసింది. లాడెన్ భార్యలు, పిల్లలు ప్రస్తుతం పాకిస్తాన్ అదుపులోనే ఉన్నారు.

English summary
Osama bin Laden’s fifth wife has claimed that the killed al Qaeda leader was not on kidney dialysis, but used to take Viagra during his stay in his Pakistani compound. Insisting that bin Laden used to take the herbal impotence drug, Amal al-Sadeh, who was shot in the leg when SEALs burst into their bedroom and killed the terror leader, said: "He believed in his own medication."
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X