హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

లవ్ అఫైర్: లేడీ కానిస్టేబుల్‌పై కానిస్టేబుల్ కాల్పులు, ఆత్మహత్యాయత్నం

By Pratap
|
Google Oneindia TeluguNews

Hyderabad
హైదరాబాద్‌: హైదరాబాదులోని కూకట్‌పల్లి పోలీస్‌స్టేషన్‌లో కానిస్టేబుల్‌ కాల్పులు జరిపిన ఘటన సంచలనం కలిగించింది. కానిస్టేబుల్‌ శ్రీనివాస్‌, మహిళా కానిస్టేబుల్‌ లలితపై కూకట్‌పల్లి పోలీస్‌స్టేషన్‌లోనే సోమవారం తెల్లవారు జామున ఒక రౌండ్‌ కాల్పులు జరిపాడు. ఈ దాడిలో మహిళాకానిస్టేబుల్‌ లలిత తీవ్రంగా గాయపడింది. ఆమెను కాల్చి శ్రీనివాస్‌ తానూ కాల్చుకోవడంతో ఇద్దరినీ హుటాహుటిన స్థానిక అపోలో ఆసుపత్రికి తరలించారు.

గత కొంతకాలంగా ఇద్దరి మధ్య ప్రేమ వ్యవహారం నడుస్తోందని అదే ఈ ఘటనకు కారణమని తెలుస్తోంది. 2009 బ్యాచ్‌కి చెందిన లలిత స్వస్థలం తూర్పు గోదావరి జిల్లా అన్నవరం. కాగా శ్రీనివాస్‌ది రంగారెడ్డి జిల్లా. ఇద్దరూ 2009లోనే ఇద్దరు కూకట్‌పల్లి పోలీసు స్టేషన్‌కు వచ్చారు. అప్పటి నుంచి వారి మధ్య ప్రేమవ్యవహారం సాగుతోందని అంటున్నారు. రాత్రి సెంట్రీ డ్యూటీలో ఉన్న శ్రీనివాస్ లలిత తనను మోసం చేసిందని, అందుకే ఆమెను చంపి తాను ఆత్మహత్య చేసుకుంటున్నానని సెంట్రీ బుక్‌లో రాశాడు.

లలిత వరిస్థితి ఆందోళనకరంగా ఉందని పోలీసు అధికారులు చెప్పారు. శ్రీనివాస్ పరిస్థితి కూడా అంతంత మాత్రంగానే ఉంది. పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకోవాలని ఇద్దరు అనుకున్నారు. అయితే, లలిత కుటుంబ సభ్యులు అంగీకరించరనే అభిప్రాయం బలంగా ఉంది. ఈ స్థితిలో ఇద్దరి మధ్య విభేదాలు పొడసూపినట్లు తెలుస్తోంది.

English summary
Constable Srinivas fired at lady constable Lalitha. The incident is occurred due to love affair between them.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X