వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

లాడన్‌ హత్యకు ప్రతీకారంగా ప్రిన్స్ హరీ టార్గెట్, హేట్ వీడియో వెల్లడి?

By Pratap
|
Google Oneindia TeluguNews

Prince Harry
న్యూఢిల్లీ: ఆల్ ఖైదా అధిపతి ఒసామా బిన్ లాడెన్ హత్యకు ప్రతీకారంగా ప్రిన్స్ హారీని లక్ష్యం చేసుకుంటామని ఉగ్రవాదులు హెచ్చరించారు. ఓ కొత్త హేట్ వీడియో ఈ విషయాన్ని వెల్లడించింది. బ్రిటిష్‌కు చెందిన ముస్లిమ్స్ అగెనెస్ట్ క్రూసేడర్స్ రూపొందించిన మూడు నిమిషాల టేప్ జిహాదీల వెబ్‌సైట్‌లో గత వారం అప్ లోడైంది. ఒసామా బిన్ లాడెన్‌ను గత శనివారం అమెరికా బలగాలు మట్టుబెట్టిన విషయం తెలిసిందే.

ఆ వీడియో ఫుటేజ్‌లో ప్రిన్స్ హారీ అఫ్గనిస్తాన్‌లో చురుగ్గా పర్యటించిన ఫొటోలు ఉన్నాయి. ఫ్యాన్సీ డ్రెస్ పార్టీలో నాజీ యూనిఫారం ధరించిన ఆయన ఫొటోగ్రాఫ్‌లు కూడా ఉన్నాయి. హారీ ది నాజీ అనే శీర్షికన విడుదలైన ఈ టేప్‌లో హారీ పాకీ, ర్యాగ్ హెడ్ వంటి పదాలు వాడిన క్లిప్పింగ్స్ ఉన్నాయి. అయితే ఆ వీడియోను తాము రూపొందించలేదని సంస్థ అధికార ప్రతినిధి అంజెమ్ చౌదరి అన్నారు. ప్రిన్స్ హారీనీ గానీ, రాచకుటుంబం సభ్యులను గానీ లక్ష్యంగా చేసుకునే ఉద్దేశం తమకు లేదని ఆయన స్పష్టం చేశారు.

English summary
In a new hate video, extremists have vowed to target Prince Harry to take revenge of Osama bin Laden’s killing. Osama bin Laden was shot dead by US forces in Pakistan last Sunday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X