నెల్లూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

జగన్ వర్గానికి ఆనం సోదరులు చెక్: విజయ డైరీ చైర్మన్‌గా సుధీర్ తొలగింపు

By Srinivas
|
Google Oneindia TeluguNews

Nellore
నెల్లూరు: శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో మాజీ పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి వర్గానికి జిల్లా మంత్రి ఆనం రామనారాయణరెడ్డి, ఎమ్మెల్యేలు ఆనం వివేకానందరెడ్డి, ఆదాల ప్రభాకర్ రెడ్డి చెక్ చెప్పే దిశలో పావులు కదుపుతున్నారు. అందులో భాగంగా నెల్లూరు విజయ డైరీ చైర్మన్‌ను తొలగించేందుకు గత కొద్దికాలంగా వారు చేస్తున్న ప్రయత్నాలు మంగళవారం ఫలించాయి. మంగళవారం ప్రవేశ పెట్టిన అవిశ్వాస తీర్మానంలో సుధీర్ రెడ్డి తన ఆధిక్యాతను నిరూపించుకోలేక పోయారు. మొత్తం 15 మంది డైరెక్టర్లలో 12 మందికి సుధీర్ రెడ్డికి వ్యతిరేకంగా ఓటు వేయగా ముగ్గురు మాత్రమే అనుకూలంగా ఓటు వేశారు. దీంతో ఆయన చైర్మన్ పదవి నుండి తొలగించబడ్డాడు. కొత్త చైర్మన్‌గా రంగారెడ్డిని ఎన్నుకున్నట్లుగా తెలుస్తోంది.

కాగా తాను జగన్‌కు మద్దతు పలుకుతున్నందునే తనపై కక్ష్యతో అవిశ్వాస తీర్మానం పెట్టించారని సుధీర్ రెడ్డి ఆరోపించారు. కోర్టు అవిశ్వాసంపై స్టే విధించినప్పటికి ఎలా పెడతారని జగన్ వర్గం ప్రశ్నిస్తోంది. అయితే నెల్లూరు జిల్లా ప్రస్తుతం పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాగా మారిందని, కోర్టు నెల్లూరు జిల్లా అని మాత్రమే చెప్పినందున అది జిల్లాకు వర్తించదని కాంగ్రెసు వర్గం చెబుతోంది. ఆనం సోదరులు, ఆదాల ప్రభాకర్ రెడ్డి మంగళవారం అవిశ్వాస తీర్మానం తంతు దగ్గర ఉండి మరీ జరిపించినట్లుగా తెలుస్తోంది. సుధీర్ రెడ్డి గతంలో జగన్ ఓదార్పులో పాల్గొనడమే కాకుండా, జగన్‌ పార్టీ వీడాక కూడా బహిరంగంగా మద్దతు తెలుపుతుండటం విశేషం.

English summary
SPS Nellore district vijaya dairy chairman was defeated in No-Confidential vote today. He get only 3 votes out of 15 vote. Board directors elected Ranga Reddy as new chairman.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X