మంత్రులు డికె అరుణ, సారయ్యలపై కెయు విద్యార్థుల కోడిగుడ్ల దాడి
Districts
oi-Srinivas G
By Srinivas
|
వరంగల్: కాకతీయ విశ్వవిద్యాలయం విద్యార్థులు మరోసారి రెచ్చిపోయారు. తెలంగాణపై కాంగ్రెసు పార్టీ అస్పష్ట విధానాన్ని వ్యతిరేకిస్తూ విద్యార్థులు మంగళవారం కలెక్టరేట్ వద్ద మంత్రులపై, కలెక్టరేట్‌పై గుడ్లతో దాడి చేశారు. డిఆర్సీ సమావేశానికి వస్తున్న మంత్రులు బస్వరాజు సారయ్య, డికె అరుణ, పొన్నాల లక్ష్మయ్యలపై విద్యార్థులు గుడ్ల వర్షం కురిపించారు. కలెక్టరేట్‌పై గుడ్లు విసిరారు. విద్యార్థులు నాలుగు సమూహాలుగా విడిపోయి గుడ్లతో దాడి చేశారు. మంత్రుల అనుచరులపై కూడా దాడి చేశారు. కాంగ్రెసు అధిష్టానాన్ని తెలంగాణకు ఒప్పించండి.. లేదంటే రాజీనామా చేయండి అని వారు డిమాండ్ చేశారు.
తెలంగాణ వచ్చే వరకు డిఆర్సీ సమావేశాన్ని నిర్వహించనివ్వమని హెచ్చరించారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితి చోటు చేసుకుంది. పరిస్థితి గమనించిన పోలీసులు విద్యార్థులను అదుపులోకి తీసుకున్నారు. అయితే తెలంగాణవాదులు దాడులు చేస్తారని ముందుగా తెలిసినప్పటికీ భద్రత ఏర్పాటు చేయక పోవడంపై మంత్రులు ఆగ్రహం వ్యక్తం చేసినట్టుగా తెలుస్తోంది. కాగా విద్యార్థుల అరెస్టు విషయంపై డిఆర్సీ సమావేశంలో తెలంగాణ రాష్ట్ర సమితి ప్రశ్నించే అవకాశం ఉంది.
Oneindia బ్రేకింగ్ న్యూస్.రోజంతా తాజా వార్తలను పొందండి